కేటీఆర్ను అభినందించిన మంచు లక్ష్మి | machu laxmi celebrates handloom sankranti at home | Sakshi
Sakshi News home page

కేటీఆర్ను అభినందించిన మంచు లక్ష్మి

Jan 14 2017 4:59 PM | Updated on Jul 15 2019 9:21 PM

కేటీఆర్ను అభినందించిన మంచు లక్ష్మి - Sakshi

కేటీఆర్ను అభినందించిన మంచు లక్ష్మి

రాష్ట్ర పరిశ్రమలు, చేనేత మంత్రి కె.తారకరామారావు చేనేత ప్రచారకర్తగా దూసుకుపోతున్నారు.

హైదరాబాద్ : రాష్ట్ర పరిశ్రమలు, చేనేత మంత్రి కె.తారకరామారావు చేనేత ప్రచారకర్తగా దూసుకుపోతున్నారు. చేనేత కార్మికులకు చేయూతనిచ్చేందుకు ప్రతి ఒక్కరూ వారంలో ఓ రోజు చేనేత వస్త్రాలు ధరించాలని ఇచ్చిన పిలుపు మేరకు భారీ స్పందన కనిపిస్తోంది. మంత్రి కార్యాలయ అధికారులు, సిబ్బందితో పాటూ టాలీవుడ్ ప్రముఖులు చేనేత వస్త్రాల ప్రాముఖ్యత, ప్రాశస్త్యాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లేందుకు తమ వంతు కృషి చేస్తున్నారు.
 
నటి మంచు లక్ష్మి సంక్రాతి పండుగ పర్వదినాన్ని చేనేత దుస్తులను ధరించి జరుపుకున్నారు. ఈ సందర్భంగా చేనేత ప్రచారకర్తగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కేటీఆర్ను అభినందించారు. సంప్రదాయక దుస్తుల్లో తండ్రి మోహన్ బాబు, పాపతో కలిసి దిగిన ఫోటోను మంచు లక్ష్మి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. 
 
చేనేత పరిశ్రమకు తాము కూడా అండగా ఉంటామంటూ ఇటీవలే నటుడు నాగార్జున కూడా భార్య అమలతో కలిసి చేనేత దుస్తులు ధరించిన ఓ ఫోటోను తన ట్విట్టర్లో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. చేనేత దుస్తులు అందంగా ఉండటమే కాకుండా ఎంతో సౌకర్యంగా ఉన్నాయని కింగ్ పేర్కొన్నారు. 


 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement