
అడవిలో మృగరాజులా..
ఈ బెడ్ వ్యూ చూశారా? ప్రకృతి మధ్య పడక .. పోలే.. అదిరిపోలే.. కనుచూపు మేరకు పచ్చటి అడవి.. రాత్రి పడుకున్నాక.. మధ్యలో మెలకువ వచ్చి చూస్తే..
ఈ బెడ్ వ్యూ చూశారా? ప్రకృతి మధ్య పడక .. పోలే.. అదిరిపోలే.. కనుచూపు మేరకు పచ్చటి అడవి.. రాత్రి పడుకున్నాక.. మధ్యలో మెలకువ వచ్చి చూస్తే.. కొంచెం దూరంలో ఏనుగులు, ఖడ్గమృగాలు, చీతాలు వంటివి కనిపించినా కనిపిం చొచ్చు. ఈ వినూత్న అనుభవాన్ని పొందాలంటే కెన్యాలోని లాయ్‌కిపియా కంట్రీలోని లోయిసబా రిసార్ట్‌కు వెళ్లాల్సిందే. అక్కడి ప్రత్యేకత ఈ స్టార్ బెడ్! ఇక్కడ భూమికి అంతెత్తులో కలపతో చేసిన గుడిసెల్లాంటివి ఉంటాయి. అయితే.. తాము చేసిన ప్రత్యేక రక్షణ చర్యల వల్ల అడవి జంతువులు వంటివి వీటిలోకి ప్రవేశించలేవని రిసార్ట్ మేనేజర్ ఫియోనా చెబుతున్నారు. దగ్గర్లోని డ్యామ్ వద్దకు ఏనుగులు, నీటి ఏనుగులు వంటివి వస్తుంటాయని, గుడిసె బాల్కనీలోంచి చూస్తే.. ఒక్కోసారి కిందనే అడవి కుక్కల వంటివి తచ్చాడుతూ కనిపిస్తాయని అంటున్నారు.
ఇదొక్కటే కాదు.. ఇక్కడికి వచ్చే పర్యాటకుల కోసం ట్రెక్కింగ్, హార్స్ రైడింగ్ వంటి ఏర్పాట్లూ ఉన్నాయి. ఒక్క రోజు బస చేయాలంటే రూ.20 వేలు చెల్లించాలి.