లెనోవో కే6 కొత్త వేరియంట్..ధర? | Lenovo K6 Power Variant With 4GB of RAM Launched in India: Price, Release Date, and More | Sakshi
Sakshi News home page

లెనోవో కే6 కొత్త వేరియంట్..ధర?

Jan 25 2017 12:42 PM | Updated on Sep 5 2017 2:06 AM

లెనోవో కే6 కొత్త వేరియంట్..ధర?

లెనోవో కే6 కొత్త వేరియంట్..ధర?

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ లెనోవో కొత్త స్మార్ట్ ఫోన్ ను మంగళవారం భారత మార్కెట్లో లాంచ్ చేసింది

చైనాకు చెందిన  ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ లెనోవో  కొత్త  స్మార్ట్ ఫోన్ ను  భారత మార్కెట్లో లాంచ్ చేసింది. కే 6  కొత్త వేరియంట్ ను  విడుదలచేస్తున్నట్టు  బుధవారం ప్రకటించింది. 4 జీబీ ర్యామ్  వేరియంట్ తో 'కే 6 పవర్' పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్ ను అందుబాటులోకి తేనుంది.  దీని  ధరను రూ.  రూ.10,999 గా కంపెనీ  నిర్ణయించింది.   జనవరి  31 నుంచి ఫ్లిప్కార్ట్ ద్వారా విక్రయించనున్నట్టు తెలిపింది.  అత్యధిక బ్యాటరీ  సామర్థ్యం దీని  ప్రత్యేకత అని కంపెనీ చెబుతోంది. పేరుకు తగ్గట్టుగానే  96.5 గంటల మ్యూజిక్ , 13.6 గంటల వీడియో, 48 గంటల వాయిస్ కాల్స్, 12.6 నెట్  వాడకం,  649 గంటల స్టాండ్ బై టైమ్ తో అల్టిమేట్  పవర్ మోడ్ తో రానుందని తెలిపింది.   ఫుల్  మెటల్ బాడీతో డిజైన్ చేసిన ఈ సరికొత్త వేరియంట్ డార్క్ గ్రే, గోల్డ్, సిల్వర్ కలర్స్ లో తీసుకొస్తున్నట్టు కంపెనీ ఒక ప్రకటనలో  తెలిపింది
 

కే 6 పవర్  ఫీచర్స్
5 అంగుళాల ఫుల్ హెచ్ డీ స్క్రీన్
1.4 గిగాహెర్ట్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్
1080x1920 పిక్సెల్ రిజల్యూషన్
–డాల్బే అట్మాస్ సౌండ్, ఫింగర్ ప్రింట్ స్కానర్
128 ఎక్స్ పాండబుల్ మెమొరీ
13 ఎంపీరియర్  కెమెరా
8 ఎంపీ ఫ్రంట్ కెమెరా
4000ఎంఏహెచ్ బ్యాటరీ
కాగా గత ఏడాది నవంబరు  కే 6 3 జీబీ వేరియింట్ ను లాంచ్  చేసింది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ అమ్మకాల్లో రికార్డులుసృష్టించిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement