నాలుగు వేరియంట్లలో లీఎకో కొత్త ఫోన్ | LeEco Le Pro 3 Launched: Price, Release Date, Specifications, and More | Sakshi
Sakshi News home page

నాలుగు వేరియంట్లలో లీఎకో కొత్త ఫోన్

Sep 21 2016 4:28 PM | Updated on Sep 4 2017 2:24 PM

నాలుగు వేరియంట్లలో లీఎకో కొత్త ఫోన్

నాలుగు వేరియంట్లలో లీఎకో కొత్త ఫోన్

ముందస్తు అంచనాల మాదిరిగా గానే చైనీస్ టెక్నాలజీ సంస్థ లీఎకో, తన లేటెస్ట్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ను బుధవారం మార్కెట్లోకి విడుదల చేసింది.

ముందస్తు అంచనాల మాదిరిగా గానే చైనీస్ టెక్నాలజీ సంస్థ లీఎకో, తన లేటెస్ట్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ను బుధవారం మార్కెట్లోకి విడుదల చేసింది. లీ ప్రో 3 పేరుతో ఈ ఫోన్ను ముందుగా స్వదేశంలో లాంచ్ చేసింది. వచ్చే వారం నుంచి ప్రారంభంకాబోతున్న ఫ్లాష్ అమ్మకాలకు ఆసక్తి గల వినియోగదారులు ఇప్పటినుంచే రిజిస్ట్రర్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. గోల్డ్, గ్రే, సిల్వర్ కలర్ వేరియంట్లలో ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. మొత్తం నాలుగు వేరియంట్లలో ఈ ఫోన్ను ఆవిష్కరించింది. 
ఒకటి 4 జీబీ ర్యామ్+32 జీబీ ఇన్బిల్ట్ స్టోరేజ్ వెర్షన్, 1,799 యువాన్లు (సుమారు 18,100 రూపాయలు)
రెండు 6 జీబీ ర్యామ్+64  జీబీ స్టోరేజ్ వెర్షన్, 1,999 యువాన్లు (సుమారు రూ.20,100 రూపాయలు)
 
ప్రముఖ చైనీస్ ఫిల్మ్మేకర్ జాంగ్ ఇమౌ పేరుమీద మరో రెండు వేరియంట్లను లీఎకో లీ ప్రో 3 ఫోన్ను ప్రవేశపెట్టింది. దానిలో ఒకటి 4 జీబీ ర్యామ్+64 జీబీ స్టోరేజ్ జాంగ్ ఇమౌ ఎడిషన్, ధర 2,499 యువాన్లు(సుమారు రూ.25,100). రెండోది 6 జీబీ ర్యామ్+128 జీబీ ఇన్బిల్ట్ స్టోరేజ్ వెర్షన్ను ధర 2,999 యువాన్ల(సుమారు రూ.30,100)కు కంపెనీ ఆవిష్కరించింది.
 
మెమరీ, ఇన్బిల్ట్ స్టోరేజ్ తేడాలు మినహా మిగతా ఫీచర్లన్నీ ఈ వేరియంట్లలో సమానంగా ఉన్నట్టు కంపెనీ తెలిపింది. అయితే 8 జీబీ ర్యామ్ వేరియంట్తో ఈ ఫోన్ను లీఎకో తీసుకొస్తుందని టెక్ వర్గాలు భావించాయి. కానీ 6జీబీ ర్యామ్లో మాత్రమే ఈ ఫోన్ను కంపెనీ ప్రవేశపెట్టింది. అయితే దీనిలో మైక్రో ఎస్డీ కార్డు ద్వారా మెమరీని విస్తరించుకునే అవకాశాన్ని కంపెనీ కల్పించలేదు. రియర్ ప్యానెల్లో ఫింగర్ప్రింట్ సెన్సార్ను ఈ ఫోన్ కలిగిఉంది.
 
ఈ ఫోన్ ఫీచర్లు..
5.5 అంగుళాల ఫుల్-హెచ్డీ డిస్ప్లే విత్ 2.5డీ కర్వ్డ్ గ్లాస్
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాలో
2.35 గిగాహెడ్జ్ క్వాడ్-కోర్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 821 ఎస్ఓసీ
16 మెగాపిక్సెల్ రియర్ కెమెరా
8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
4జీ ఎల్టీఈ
4070 ఎంఏహెచ్ బ్యాటరీ
175 గ్రాములు

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement