'మోడీ సభకు అనుమతి వద్దు' | Lawyer case files on Madras high court due to modi meeting | Sakshi
Sakshi News home page

'మోడీ సభకు అనుమతి వద్దు'

Jan 31 2014 2:50 PM | Updated on Oct 8 2018 3:56 PM

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ చెన్నై నగరంలో నిర్వహించనున్న బహిరంగ సభ వల్ల శాంతి భద్రతలకు ఆటంకం కలుగుతుందని స్థానికుడు ఒకరు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు.

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ చెన్నై నగరంలో నిర్వహించనున్న బహిరంగ సభ వల్ల శాంతి భద్రతలకు ఆటంకం కలుగుతుందని స్థానికుడు ఒకరు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో నరేంద్ర మోడీ సభకు అనుమతివ్వొద్దని సదరు వ్యక్తి మద్రాస్ హైకోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలు చేశాడు.

 

వచ్చే నెల 8వ తేదీన  చెన్నై మహానగరంలో బీజేపీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఆ సభకు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ హాజరుకానున్నారు. అయితే మోడీ రాకతో తమిళనాడులో అంతంత మాత్రంగా ఉన్న శాంతి భద్రతల సమస్య మరింత పెరిగే అవకాశం ఉందని సదరు పిటిషినర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే మద్రాసు హైకోర్టు తీర్పును వాయిదా వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement