breaking news
law and order problem
-
బెజవాడ.. గజ గజలాడ!
బెజవాడ నేరాలకు అడ్డాగా మారుతోంది. రౌడీలు.. కేడీలు కాలరెగరేస్తున్నారు. పోలీసుల నిఘా నిద్రలోకి జారుకుంది. పోలీసులు పట్టుకోల్పోవడంతో అరాచక శక్తులు హడలెత్తిస్తున్నాయి. నగరంలో సామాన్య ప్రజలు నిర్భయంగా రాత్రి వేళలో బయటకు రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి కొనసాగుతోంది. బ్లేడ్‌బ్యాచ్ ఘోరాలు.. రౌడీ బ్యాచ్‌ల గ్యాంగ్‌వార్‌లతో విజయవాడ నగరం మౌనంగా శోకిస్తోంది. పోలీసుల ఉదాసీన వైఖరిని ప్రశ్నిస్తోంది. సాక్షి, విజయవాడ : బెజవాడలో ఘరానా నేరాలు విస్తరిస్తున్నాయి. బెదిరింపులు.. సెటిల్మెంట్లు.. చివరకు హత్యలు చేసేస్థాయికి చేరుకున్నాయి. పక్కా ప్రణాళికలతో కొందరు రౌడీషీటర్లు తమ ప్రత్యర్థులను హతమారుస్తుండగా.. పోలీసులు మాత్రం వ్యక్తిగత కక్షలే అంటూ సాధారణంగా తీసుకుంటున్నారు. రాజధాని విజయవాడలో అసాంఘిక శక్తుల అధికారిక చిట్టా ప్రకారం.. నగరంలో నలుగురు నగర బహిష్కృతులు.. 443 మంది రౌడీషీటర్లు.. 30 మంది కేడీలు.. 70 మంది బ్లేడ్‌బ్యాచ్ సభ్యులు ఉన్నారు. అనధికారికంగా ఇంకా చాలా మందే ఉన్నారు. ఇంతమంది నేరచరితులు ఉంటే పోలీసు వ్యవస్థ ఎంతో అప్రమత్తంగా ఉండాలి. కానీ విజయవాడలో అదే కొరవడుతోంది. పోలీసు వ్యవస్థ ఉదాసీనతతో శనివారం అర్ధరాత్రి టూటౌన్ ప్రాంతంలో రౌడీషీటర్ సురేష్‌ను అతడి ప్రత్యర్థులు కత్తులతో దారుణంగా హత్య చేశారు. విజయవాడలోని 20 పోలీస్ ఠాణాల పరిధుల్లో ఏ తరహా నేరాలు జరుగుతున్నాయి? రౌడీషీటర్లలో ఎవరెవరు అల్లర్లు సష్టిస్తున్నారు? కొత్తగా ఎవరైనా నేరాలకు పాల్పడుతున్నారా? అన్న అంశాలపై పోలీసులు లోతుగా పరిశోధించకపోవడంతో రౌడీషీటర్లు, వారి అనుచరుల ఆగడాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. బహిష్కృతులు నలుగురూ నగరంలోనే.. బహిష్కృతులైన నలుగురు నేరస్తులు నగరంలోనే దర్జాగా తిరుగుతున్నా పట్టించుకునేంత తీరిక పోలీసులకు లేకుండాపోయింది. అందుకు ఉదాహరణే ఖల్ నాయక్ ఉదంతం. ఖల్ నాయక్‌తో పాటు కోతల శివ, ముక్కల రవి, ముక్కల కోటేశ్వరరావు అనే నలుగురికి నగర బహిష్కరణ శిక్ష విధించారు. నగర బహిష్కరణకు గురైన వారు నిజంగానే నగరాన్ని విడిచి వెళ్లారా? అనధికారికంగా నగరంలోనే ఉంటున్నారా? అనే కోణంలో పోలీసులు నిఘా వేసి ఉంచాలి. కానీ నగర పోలీసులు కీలకమైన ఆ విషయన్నే గాలికి వదిలేశారు. నగర బహిష్కృతుడిగా ఉన్న ఖల్ నాయక్ నగరంలోనే దర్జాగా కార్యకలాపాలు సాగించాడు. 2017లో అతడిపై నాలుగు కేసులు కూడా నమోదు కావడం గమనార్హం. పోలీసుల నిర్లక్ష్యం ఫలితం ఖల్ నాయక్ చేతిలో ఒకరు హత్యకు గురయ్యారు. అప్పుడుగానీ పోలీసులు మేల్కొనలేదు. రౌడీషీటర్లపై నిఘా ఏదీ? ఎక్కడాలేని రీతిలో విజయవాడలో 443 మంది రౌడీషీటర్లు, 30 మంది వరకు కేడీలు ఉన్నారు. నిబంధనల ప్రకారం రౌడీషీటర్లు నియమిత కాలవ్యవధి ప్రకారం పోలీస్ స్టేషన్‌కు వచ్చి సంతకాలు చేయాలి. పోలీసు అధికారులు రౌడీషీటర్లకు తరచూ కౌన్సెలింగ్ చేస్తుండాలి. తద్వారా వారి ప్రవర్తన, కదలికలపై తాము ఓ కన్నేసి ఉంచామనేది స్పష్టం చేస్తుండాలి. రెండేళ్లుగా నగరంలో రౌడీషీటర్ల వ్యవహారాలను పోలీసులు ఏమాత్రం పట్టించుకోవడమే లేదు. బెంబేలెత్తిస్తున్న బ్లేడ్‌బ్యాచ్.. విజయవాడలో దాదాపు 70 మంది బ్లేడ్‌బ్యాచ్ ముఠా సభ్యులు ఉన్నారు. వారు తమదైన శైలిలో దొంగతనాలు చేస్తూ అవసరమైతే దాడులు చేస్తూ బెంబేలెత్తిస్తున్నారు. కొన్ని నెలలుగా గుర్తుతెలియని వ్యక్తులు దాడులకు పాల్పడుతున్న కేసులు, గ్యాంగ్‌వార్ కేసులు నమోదు అవుతునే ఉన్నాయి. అవన్నీ బ్లేడ్‌బ్యాచ్ ఆగడాలేనని స్పష్టమవుతున్నా పోలీసులు మాత్రం కఠిన చర్యలు చేపట్టనే లేదు. ఈ ఏడాది సాక్షాత్తూ టాస్క్‌ఫోర్స్ కార్యాలయం ఎదురుగానే నలుగురు బ్లేడ్ బ్యాచ్ సభ్యులు ఒకరిపై ఒకరు బ్లేడ్లతో దారుణంగా దాడులు చేసుకున్నారు. ఆ సమయంలో ఆ రహదారిపై వెళ్తున్న సామాన్య ప్రజలు భయంతో హడలిపోయారు. ఆ ఘటనలో శనివారం మృతి చెందిన రౌడీషీటర్ సురేష్ ఉండటం గమనార్హం. బైండోవర్లు అంతంతే.. విజయవాడ నగర కమిషనరేట్‌లోని నాలుగు జోన్లలో టూటౌన్, నున్న పోలీసుస్టేషన్ల పరిధిలోనే రౌడీషీటర్లు ఎక్కువగా ఉన్నారు. దశాబ్దాలుగా వీరు దందాలు, సెటిల్మెంట్లు చేస్తున్నారు. రౌడీషీటర్లు, కేడీలు, ఇతర అసాంఘిక శక్తుల పట్ల కొందరు అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కొందరు అధికారులు వారితో సన్నిహితంగా ఉంటూ సెటిల్మెంట్లు, దందాల్లో భాగస్వాములు అవుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకు ఉదాహరణే ఖల్ నాయక్ ఉదంతం. అతడి ఆగడాలపై బాధితులు ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా సింగ్‌నగర్ పోలీసులు పట్టించుకోలేదు. ఓ వ్యక్తి హత్య తరువాతే ఉన్నతాధికారులు మేల్కొని అప్పట్లో సింగ్‌నగర్ సీఐపై సస్పెన్షన్ వేటు వేశారు. ఒక్క సింగ్ నగరే కాదు.. నగరంలో సగానికిపైగా పోలీస్ స్టేషన్లలో పరిస్థితి అలానే ఉంది. ఎన్నికలు, ఇతర పండుగలప్పుడు శాంతిభద్రతల కోణంలో ప్రతి పోలీస్ స్టేషన్లో రౌడీషీటర్లను బైండోవర్ చేస్తున్నారు. కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ వ్యవహారం కూడా ఓ తంతుగా కొనసాగుతోంది. సాధారణ ఎన్నికల సందర్భంగా ప్రతి పోలీస్ స్టేషన్లో రౌడీషీటర్లను బైండోవర్ చేశారు. ఎన్నికల పోలింగ్ (11–4–19) ముగిసిన మూడు నెలల్లోనే రౌడీషీటర్లు గ్యాంగ్‌వార్ మొదలు పెట్టారంటే పోలీస్ అంటే వారికి ఏమాత్రం భయం లేదని అర్థమవుతోంది. -
ఆమ్నెస్టీని నిషేధించాలి
బెంగళూరులో బీజేపీ భారీ నిరసన కేంద్రానికి డిప్యూటీ మాజీ సీఎం ఆర్.అశోక్ లేఖ ఉన్నతస్థాయి దర్యాప్తు చేపట్టాలి బెంగళూరు : కర్ణాటకలో శాంతిభద్రతల సమస్యకు కారణమైన ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుని నిషేధించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందని పేర్కొం టూ కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు లేఖ రాసినట్లు మాజీ ఉపముఖ్యమంత్రి ఆర్.అశోక్ తెలిపారు. భారత సైనికులకు వ్యతిరేకంగా వ్యాఖ్యానించిన వారిని అరెస్టు చేయాలని, అమ్నెస్టీ సంస్థను నిషేధించాలని పేర్కొంటూ అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) రాష్ట్ర వ్యాప్తంగా నిరసనల కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం నిరసనకారులపై జరిగిన లాఠీచార్జ్‌ను నిరసిస్తూ రాష్ట్ర బీజేపీ మహిళామోర్చ విభాగం న గరంలోని ఆనంద్‌రావ్ సర్కిల్ వద్ద శనివారం నిరసనకు దిగింది. ఇందులో ఆ పార్టీ ముఖ్యనేతలైన ఆర్.అశోక్, పీ.సీ మోహన్, సురేష్‌కుమార్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... తప్పు చేసిన వారిని వదిలి ఆ తప్పును ప్రశ్నించిన వారిపై అధికార కాంగ్రెస్ పార్టీ కక్షకట్టిందన్నారు. అందువల్లే భారత సైనికులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన వారితో పాటు అందుకు కారణమైన ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్పై దేశద్రోహం కేసు నమోదైనా ఇప్పటి వరకు సదరు కేసులో ఎవరిని అరెస్ట్ కూడా చేయలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాలన్నింటినీ వివరిస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు లేఖ రాసామని పేర్కొన్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ లేదా ఏదేని స్వతంత్ర సంస్థతో ఈ విషయంపై విచారణ జరిపించి ఘటనకు కారణమైన వారిని చట్టం ప్రకాశం శిక్షించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా ఏబీవీపీ నిర్వహిస్తున్న నిరసనకు మద్దతు తెలిపిన ప్రముఖ న్యాయవాది ప్రమీళనై సర్గి తదితరులు మాట్లాడారు. ఇదిలా ఉంటే ఏబీవీపీ నిరసనల నేపథ్యంలో బెంగళూరులోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. ఆమ్నెస్టీ తప్పేమీ లేదు ! ఘటన సంబంధించి రాష్ట్ర హోంశాఖ మంత్రి పరమేశ్వర్ శనివారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. ‘ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తప్పు ఏమీ చేయలేదు. కాశ్మీర్ బాధితులకు సాంత్వన చెప్పడంతో పాటు సహాయం అందించడానికి మాత్రమే నగరంలో కార్యక్రమం నిర్వహించింది. ఈ విషయాన్ని ఏబీవీపీ అనవసరంగా రాద్ధాంతం చేస్తూ ఆ సంస్థ దేశద్రోహానికి పాల్పడిందని పేర్కొంటున్నారు. ఇది చాలా తప్పు.’ అని పేర్కొన్నారు. ఇక ఎల్లప్పుడూ విదేశాల్లో ఉండే ప్రధాని నరేంద్రమోదీ దేశంలో అంతర్భాగమైన రాష్ట్రాల్లోని సమస్యల పరిష్కారం పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. -
'మోడీ సభకు అనుమతి వద్దు'
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ చెన్నై నగరంలో నిర్వహించనున్న బహిరంగ సభ వల్ల శాంతి భద్రతలకు ఆటంకం కలుగుతుందని స్థానికుడు ఒకరు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో నరేంద్ర మోడీ సభకు అనుమతివ్వొద్దని సదరు వ్యక్తి మద్రాస్ హైకోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలు చేశాడు. వచ్చే నెల 8వ తేదీన చెన్నై మహానగరంలో బీజేపీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఆ సభకు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ హాజరుకానున్నారు. అయితే మోడీ రాకతో తమిళనాడులో అంతంత మాత్రంగా ఉన్న శాంతి భద్రతల సమస్య మరింత పెరిగే అవకాశం ఉందని సదరు పిటిషినర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే మద్రాసు హైకోర్టు తీర్పును వాయిదా వేసింది.