కేసీఆర్ మెతక వైఖరి వల్లే ... | Law & Order in Hyderabad to remain under Telangana Govt, says Congress MLA jeevan reddy | Sakshi
Sakshi News home page

కేసీఆర్ మెతక వైఖరి వల్లే ...

Jun 23 2015 1:03 PM | Updated on Aug 11 2018 4:59 PM

కేసీఆర్ మెతక వైఖరి వల్లే ... - Sakshi

కేసీఆర్ మెతక వైఖరి వల్లే ...

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మెతక వైఖరి వల్లే ఓటుకు కోట్లు కేసు నీరుగారుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.జీవన్రెడ్డి ఆరోపించారు.

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మెతక వైఖరి వల్లే ఓటుకు కోట్లు కేసు నీరుగారుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.జీవన్రెడ్డి ఆరోపించారు. మంగళవారం హైదరాబాద్లో జీవన్రెడ్డి మాట్లాడుతూ... హైదరాబాద్లో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసులను ఆంధ్రప్రదేశ్లో ఫైల్ చేస్తే అవి చెల్లవన్నారు.

ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉంటే ఆ ఫిర్యాదు ఏపీ ప్రభుత్వం హైదరాబాద్ పోలీసులకే ఫిర్యాదు చేయాలని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ సలహాలు, సూచనల మేరకే గవర్నర్ వ్యవహరిస్తారని జీవన్రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్లో శాంతి భద్రతల బాధ్యత పూర్తిగా తెలంగాణ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు సెక్షన్ -8లో ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన లేదని జీవన్రెడ్డి పేర్కొన్నారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement