మావోయిస్ట్ నేత కిషన్ జీ వ్యక్తిగత వైద్యుడు అరెస్ట్ | Kishanji's doctor arrested for Maoist links | Sakshi
Sakshi News home page

మావోయిస్ట్ నేత కిషన్ జీ వ్యక్తిగత వైద్యుడు అరెస్ట్

Dec 13 2013 9:45 AM | Updated on Sep 2 2017 1:34 AM

మావోయిస్టు అగ్రనేత మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్ జీ వ్యక్తిగత వైద్యుడు సమీర్ బిశ్వాస్ను అరెస్ట్ చేసినట్లు పశ్చిమ బెంగాల్ పోలీసులు శుక్రవారం వెల్లడించారు.

మావోయిస్టు అగ్రనేత మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్ జీ వ్యక్తిగత వైద్యుడు సమీర్ బిశ్వాస్ను అరెస్ట్ చేసినట్లు పశ్చిమ బెంగాల్ పోలీసులు  శుక్రవారం వెల్లడించారు. బుర్ద్వాన్ జిల్లా అసన్సోల్ పట్టణంలోని సమీర్ని అతడి సోదరుని నివాసంలో నిన్న రాత్రి అదుపులోకి తీసుకుని, అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అనంతరం అతడిని స్థానిక కోర్టులో హాజరుపరిచినట్లు చెప్పారు. సమీర్ గత మూడు ఏళ్లుగా అజ్ఞాత జీవితం గడుపుతున్నారని పేర్కొన్నారు.

 

మావోయిస్టు అగ్రనేతలు కిషన్ జీతోపాటు పలువురికి సమీర్ తరచు వైద్య సేవలు అందించేవాడని తమ వద్ద పూర్తి సమాచారం ఉందని తెలిపారు. మావోయిస్టు నేతల కీలక సమాచారాన్ని రాబట్టేందుకు సమీర్ను పోలీసులు విచారిస్తున్నారు. అటు కేంద్రప్రభుత్వానికి ఇటు బెంగాల్లోని మమత ప్రభుత్వాని కొరకరాని కొయ్యలా మావోయిస్టు అగ్రనేత కిషన్ తయారయ్యారు. ఈ నేపథ్యంలో 2011, నవంబర్లో కిషన్ జీని పశ్చిమ మిడ్నాపూర్లోని బురిశోల్ అడువుల్లో కేంద్ర బలగాలు కాల్చి చంపిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement