జూబ్లీహిల్స్ సొసైటీ అధ్యక్షుడిగా నరేంద్ర చౌదరి | Jubilee Hills Society president Narendra Chaudhary | Sakshi
Sakshi News home page

జూబ్లీహిల్స్ సొసైటీ అధ్యక్షుడిగా నరేంద్ర చౌదరి

Oct 3 2015 3:43 AM | Updated on Aug 31 2018 8:24 PM

జూబ్లీహిల్స్ సొసైటీ అధ్యక్షుడిగా నరేంద్ర చౌదరి - Sakshi

జూబ్లీహిల్స్ సొసైటీ అధ్యక్షుడిగా నరేంద్ర చౌదరి

ప్రతిష్టాత్మక జూబ్లీహిల్స్ కో-ఆపరేటివ్ హౌజ్ బిల్డింగ్ సొసైటీ అధ్యక్షుడిగా తుమ్మల నరేంద్ర చౌదరి వరుసగా మూడో పర్యాయం ఎన్నికయ్యారు

వరుసగా మూడోసారి ఎన్నిక
15 మందితో కార్యవర్గం


 సాక్షి, హైదరాబాద్ : ప్రతిష్టాత్మక జూబ్లీహిల్స్ కో-ఆపరేటివ్ హౌజ్ బిల్డింగ్ సొసైటీ అధ్యక్షుడిగా తుమ్మల నరేంద్ర చౌదరి వరుసగా మూడో పర్యాయం ఎన్నికయ్యారు. 15 మందితో కూడిన సొసైటీ  కార్యవర్గం శుక్రవారం బాధ్యతలు స్వీకరించింది. హైదరాబాద్ జిల్లా సహకార అధికారి పర్యవేక్షణలో గురువారం 15 మంది కార్య నిర్వాహక సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తిరిగి శుక్రవారం సొసైటీ భవనంలో సమావేశమైన కార్య నిర్వాహక సభ్యులు టి.నరేంద్ర చౌదరిని అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా టి.దేవేందర్‌రెడ్డి, కార్యదర్శిగా టి.హనుమంతరావు, అదనపు కార్యదర్శిగా డాక్టర్ వి.వెంకటేశ్, కోశాధికారిగా ఎ.సురేశ్‌రెడ్డి ఎన్నికయ్యారు.

అంజనారెడ్డి, కె.ఏకాంబర్‌రెడ్డి, కిషోర్‌బాబు మిద్దె, ఎస్‌ఆర్ కోటిపల్లి, వై.నాగేశ్వర్‌రావు, కె.రమేశ్ చౌదరి, జి.రామకృష్ణంరాజు, లలిత్‌కుమార్ గుప్తా, ఎం.వే ణుగోపాల్, పి.శరత్‌కుమార్ కార్యనిర్వాహక సభ్యులుగా ఎన్నికయ్యారు. 1962లో ఏర్పాటైన ఈ సొసైటీలో 4961 మంది సభ్యులున్నారు.  దీనిలో రాజకీయ, వ్యాపార, సినీ, క్రీడా రంగాల ప్రముఖులు  సభ్యులుగా ఉన్నారు. సొసైటీ ఎన్నికలు నిలిపివేయాలంటూ కొందరు సభ్యు లు హైకోర్టును ఆశ్రయించగా, తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలో సహకార శాఖ జాయింట్ రిజిస్ట్రార్ పర్యవేక్షణలో జరిగిన ఎన్నికల్లో 24 మంది నామినేషన్లు వేశారు. పోలింగ్ అవసరం లేకుండానే పరస్పర సంప్రదింపుల ద్వారా 15 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భవిష్యత్తులోనూ సొసైటీ సభ్యులు సంతృప్తి చెందేలా బాధ్యతలు నిర్వర్తిస్తామని నూతన కమిటీ ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement