రెండు చోట్ల పోటీ చేస్తున్న మాంఝీ | Jitan Manjhi to contest from two assembly seats | Sakshi
Sakshi News home page

రెండు చోట్ల పోటీ చేస్తున్న మాంఝీ

Sep 29 2015 5:53 PM | Updated on Jul 18 2019 2:11 PM

రెండు చోట్ల పోటీ చేస్తున్న మాంఝీ - Sakshi

రెండు చోట్ల పోటీ చేస్తున్న మాంఝీ

బిహార్ మాజీ ముఖ్యమంత్రి, హిందూస్తాన్ అవామీ మోర్చా (హెచ్ఏఎమ్) అధ్యక్షుడు జీతన్ రామ్ మాంఝీ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేస్తున్నారు.

పాట్నా: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, హిందూస్తాన్ అవామీ మోర్చా (హెచ్ఏఎమ్) అధ్యక్షుడు జీతన్ రామ్ మాంఝీ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేస్తున్నారు. ఇమామ్గంజ్, మఖ్దమ్పూర్ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి బరిలో నిలవనున్నట్టు హెచ్ఏఎమ్ ప్రతినిధి డానిష్ రిజ్వాన్ తెలిపారు.

243 అసెంబ్లీ స్థానాలున్న బిహార్లో ఎన్డీయే భాగస్వామిగా మాంఝీ పార్టీ 20 చోట్ల పోటీ చేస్తోంది. తొలి విడతలో 13 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. బిహార్లో ఎన్డీయే పక్షాలు బీజేపీ 160, లోక్ జనశక్తి పార్టీ 40, రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ 23 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. మాంఝీ పార్టీకి 20 స్థానాలు కేటాయించారు. అక్టోబర్ 12 నుంచి ఐదు విడతల్లో బిహార్ ఎన్నికలు జరగనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement