విడాకులకు కేరాఫ్ అడ్రస్ ఫేస్ బుక్! | Is Facebook addiction pushing up divorce cases? | Sakshi
Sakshi News home page

విడాకులకు కేరాఫ్ అడ్రస్ ఫేస్ బుక్!

Jul 22 2014 5:48 PM | Updated on Jul 26 2018 5:21 PM

విడాకులకు కేరాఫ్ అడ్రస్ ఫేస్ బుక్! - Sakshi

విడాకులకు కేరాఫ్ అడ్రస్ ఫేస్ బుక్!

సామాజిక బంధాలకు ఫేస్ బుక్ దగ్గర దారి అనే భావనకు కాలం చెల్లినట్టే కనిపిస్తోంది.

సామాజిక బంధాలకు ఫేస్ బుక్ దగ్గర దారి అనే భావనకు కాలం చెల్లినట్టే కనిపిస్తోంది. పచ్చని సంసార జీవితంలో సోషల్ మీడియా వెబ్ సైట్ ఫేస్ బుక్ చిచ్చు పెడుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఫేస్ బుక్ కారణంగా దాంపత్య సంబంధాలకు ముప్పు వాటిల్లుతోందని ఓ అధ్యయనంలో పరిశోధకులు వెల్లడించారు. 
 
ఫేస్ బుక్ విరివివిగా వాడటం కారణంగా యూఎస్ లోని అన్ని రాష్ట్రాల్లోనూ విడాకుల కేసులు ఎక్కువగా నమోదైనట్టు పరిశోధనలో తేల్చారు. ఫేస్ బుక్ ఎక్కువగా ఉపయోగించడం కారణంగా ఈ సంవత్సర కాలంలో విడాకుల నమోదు 4 శాతం పెరిగినట్టు ఓ నివేదికలో పేర్కొన్నారు. 
 
సోషల్ మీడియా వెబ్ సైట్లు ఫేస్ బుక్, ట్విటర్, ఇతర వెబ్ సైట్లపై సమయాన్ని గడిపేవారికి వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తుతున్నాయని పరిశోధకకులు తెలిపారు. విడాకులు తీసుకున్న వారిలో ఫేస్ బుక్ వినియోగం పెరిగిందా అనే విషయాన్ని పరిశోధకులు వెల్లడించలేదు.  ఈ అధ్యయనాన్ని టైమ్ మ్యాగజైన్ ఓ కథనంలో వెల్లడించింది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement