రైల్వే టిక్కెట్ల బుకింగ్కు కొత్త యాప్ | IRCTC to launch new app for faster booking of tickets | Sakshi
Sakshi News home page

రైల్వే టిక్కెట్ల బుకింగ్కు కొత్త యాప్

Jan 6 2017 7:53 PM | Updated on Sep 5 2017 12:35 AM

రైల్వే టిక్కెట్ల బుకింగ్కు కొత్త యాప్

రైల్వే టిక్కెట్ల బుకింగ్కు కొత్త యాప్

రైల్వే టిక్కెట్ల బుకింగ్ను ప్రయాణికులు మరింత వేగవంతంగా పూర్తి చేసుకోవడానికి వీలుగా ఐఆర్సీటీసీ కొత్త టిక్కెటింగ్ యాప్ను త్వరలోనే లాంచ్ చేసేందుకు సిద్ధమైంది.

రైల్వే టిక్కెట్ల బుకింగ్ను ప్రయాణికులు మరింత వేగవంతంగా పూర్తి చేసుకోవడానికి వీలుగా ఐఆర్సీటీసీ కొత్త టిక్కెటింగ్ యాప్ను త్వరలోనే లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ప్రస్తుతమున్న టిక్కెట్ బుకింగ్ యాప్కు మరిన్ని కొత్త ఫీచర్లను కలుపుతూ ఈ యాప్ను ఐఆర్సీటీసీ ఆవిష్కరించనుంది. లేటెస్ట్ టెక్నాలజీతో ఈ యాప్ను రూపొందిస్తున్నామని, మరింత వేగవంతంగా, సులభతరంగా  ఐఆర్సీటీసీ ద్వారా ఇక టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చని రైల్వే మంత్రిత్వశాఖ అధికారులు చెబుతున్నారు.
 
ఆన్లైన్ ట్రైన్ టిక్కెట్ బుకింగ్ కోసం ఐఆర్సీటీసీ అధికారికంగా ఐఆర్సీటీసీ రైల్ కనెక్ట్ యాప్ను వచ్చే వారంలో ప్రారంభించనుందని పేర్కొన్నారు. ప్రయాణికుల డిమాండ్ పెరుగుతుండటంతో ఆ యాప్ను రైల్వే లాంచ్ చేయనుంది. తర్వాత తరం ఈ-టిక్కెటింగ్ సిస్టమ్ ఆధారంతో దీన్ని తీసుకొస్తున్నారు.  రైల్వే టిక్కెట్లను సెర్చ్ చేసుకోవడానికి, బుక్ చేసుకోవడానికి ఈ యాప్ ప్రయాణికులకు ఉపయోగపడనుంది. టిక్కెట్లను క్యాన్సిల్ చేసుకునే సదుపాయాన్ని ప్రయాణికులకు ఈ యాప్ ద్వారా ఐఆర్సీటీసీ కల్పించనుంది. ఈ కొత్త అప్లికేషన్ ద్వారా తర్వాత చేయబోయే ప్రయాణ అలర్ట్లను పొందవచ్చు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement