బీమా కంపెనీల విలీనం యోచన లేదు | insurance companies not merged, says arun jaitley | Sakshi
Sakshi News home page

బీమా కంపెనీల విలీనం యోచన లేదు

Dec 6 2014 2:30 AM | Updated on Aug 21 2018 5:36 PM

పబ్లిక్ సెక్టార్‌లోని సాధారణ బీమా కంపెనీలను కలిపే యోచన లేదని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ స్పష్టం చేశారు.

* లోక్‌సభలో పొంగులేటి ప్రశ్నకు సమాధానమిచ్చిన జైట్లీ

సాక్షి, న్యూఢిల్లీ: పబ్లిక్ సెక్టార్‌లోని సాధారణ బీమా కంపెనీలను కలిపే యోచన లేదని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి లోక్‌సభలో అడిగిన ఓ ప్రశ్నకు శుక్రవారం మంత్రి సమాధానమిచ్చారు. అయితే ఆయా కంపెనీల నుంచి అటువంటి ప్రతిపాదనలు వచ్చాయని జైట్లీ తెలిపారు.

అధిక పన్నుల కారణంగా దేశంలో ఏవైనా కంపెనీలు మూతపడిన దాఖలాలున్నాయా? వివరాలు తెలపాలంటూ పొంగులేటి అడిగిన మరో ప్రశ్నకు అలా కంపెనీలు మూతపడినట్టు ఎలాంటి సమాచారం లేదని మంత్రి పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement