ప్చ్.. నిరాశే: పరిశ్రమ వర్గాలు | Industry disappointed by surprise repo rate increase: Naina Lal Kidwai | Sakshi
Sakshi News home page

ప్చ్.. నిరాశే: పరిశ్రమ వర్గాలు

Sep 21 2013 1:20 AM | Updated on Sep 1 2017 10:53 PM

పాలసీ రేట్లు తగ్గిస్తుందని ఆశిస్తుండగా.. రిజర్వ్ బ్యాంక్ అందుకు భిన్నంగా పెంచడంపై పరిశ్రమ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి.

న్యూఢిల్లీ: పాలసీ రేట్లు తగ్గిస్తుందని ఆశిస్తుండగా.. రిజర్వ్ బ్యాంక్ అందుకు భిన్నంగా పెంచడంపై పరిశ్రమ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. అధిక వడ్డీ రేట్లు... వృద్ధికి ప్రధాన విఘాతంగా భావిస్తున్న తరుణంలో రెపో రేటును మరింత పెంచడం ఆశ్చర్యపర్చిందని పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ ప్రెసిడెంట్ నైనా లాల్ కిద్వాయ్ వ్యాఖ్యానించారు. పరిశ్రమ వర్గాలు తీవ్ర నిరాశకు గురయ్యాయన్నారు. పరిశ్రమ పరిస్థితి బాగా లేదని అంగీకరించిన ఆర్‌బీఐ.. రెపో రేటును తగ్గించి ఉంటే సెంటిమెంటు మెరుగుపడేలా సానుకూల సంకేతాలు పంపినట్లయి ఉండేదని కిద్వాయ్ అభిప్రాయపడ్డారు.
 
 వడ్డీ రేట్లను తగ్గించడం, రుణాలను అందుబాటులోకి తేవాలన్నదే తమ విజ్ఞప్తి అని, ఆర్‌బీఐ దీన్ని దృష్టిలో పెట్టుకోగలదని ఆశిస్తున్నామని ఆమె చెప్పారు. ద్రవ్య లభ్యత లేక పరిశ్రమ సతమతమవుతున్న నేపథ్యంలో రెపో రేటును పెంచకుండా ఉండాల్సిందని సీఐఐ డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ చెప్పారు. ద్రవ్య లభ్యత కఠినతరం కావడం వల్ల వడ్డీ రేట్లు మరింత పెరిగే అవకాశముందని, ఎస్‌బీఐ బాటలోనే మిగతా బ్యాంకులూ నడిచే ప్రమాదముందని అసోచాం ప్రెసిడెంట్ రాణా కపూర్ పేర్కొన్నారు.
 
 రియల్టీ పెదవి విరుపు..
 ఆర్‌బీఐ పాలసీ రేటు పెంపు వల్ల వడ్డీల భారం పెరుగుతుందని, పండుగ సీజన్‌లో హౌసింగ్‌కి డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుందని డీఎల్‌ఎఫ్ సీఎఫ్‌వో అశోక్ త్యాగి   చెప్పారు. మరోవైపు, ఆర్‌బీఐ నిర్ణయం తీవ్రంగా నిరాశపర్చేదిగా ఉందని పార్శ్వనాథ్ డెవలపర్స్ చైర్మన్ ప్రదీప్ జైన్ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement