సొంత ఇంటికి ఇంద్రాణి! | Indrani taken to her Worli home a day before custody ends | Sakshi
Sakshi News home page

సొంత ఇంటికి ఇంద్రాణి!

Sep 6 2015 6:58 PM | Updated on Sep 3 2017 8:52 AM

సొంత ఇంటికి ఇంద్రాణి!

సొంత ఇంటికి ఇంద్రాణి!

దేశంలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు, ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియాను పోలీసులు వర్లీలోని ఆమె సొంత నివాసానికి తీసుకెళ్లారు.

ముంబయి: దేశంలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు, ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియాను పోలీసులు వర్లీలోని ఆమె సొంత నివాసానికి తీసుకెళ్లారు. మరో రోజులో ఆమె కస్టడీ ముగుస్తుండగా అనూహ్యంగా సొంత నివాసం తీసుకెళ్లడం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రస్తుతం ఖర్ పోలీస్టేషన్లో గత కొద్ది రోజులుగా విచారిస్తున్న ఆమెను మరో ఇద్దరిని వర్లీ నివాసంలోని నాలుగో అంతస్తుకు తీసుకెళ్లి అక్కడ గంటపాటు విచారించారు.

ఆ ప్రాంతమంతా నివాసాల సముదాయం కావడంతో ఒక్కసారిగా పోలీసుల అలికిడి వినిపించడంవల్ల కొంత నిశ్శబద్దం చోటుచేసుకుంది. ముఖ్యంగా హత్య చేసిన రోజు షీనా మృతదేహాన్ని ఎక్కడ ఉంచారు, అప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని అంశంపై ఆరా తీసినట్లు పోలీసుల సమాచారం. ఈ విచారణ అనంతరం తిరిగి పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement