ప్రపంచ డాన్స్ ఛాంపియన్స్గా భారతీయులు | Indians win World of Dance trophy in US | Sakshi
Sakshi News home page

ప్రపంచ డాన్స్ ఛాంపియన్స్గా భారతీయులు

Aug 17 2015 5:43 PM | Updated on Sep 3 2017 7:37 AM

ప్రపంచ డాన్స్ ఛాంపియన్స్గా భారతీయులు

ప్రపంచ డాన్స్ ఛాంపియన్స్గా భారతీయులు

భారతీయ సంప్రదాయ నృత్యానికి తిరుగులేదన్న విషయం ప్రపంచ వేదికపై మరోసారి నిరూపితమైంది. అమెరికాలో 14 దేశాల నుంచి వచ్చిన 34 టీములను తోసిరాజని 'దేశీ హాపర్స్' అనే బృందం ప్రపంచ డాన్స్ ఛాంపియన్స్గా అవతరించింది.

భారతీయ సంప్రదాయ నృత్యానికి తిరుగులేదన్న విషయం ప్రపంచ వేదికపై మరోసారి నిరూపితమైంది. అమెరికాలో 14 దేశాల నుంచి వచ్చిన 34 టీములను తోసిరాజని 'దేశీ హాపర్స్' అనే బృందం ప్రపంచ డాన్స్ ఛాంపియన్స్గా అవతరించింది. అత్యంత వేగంగా వచ్చే వెస్ట్రన్ మ్యూజిక్కు భారతీయ సంప్రదాయ నృత్యరీతుల్లో డాన్స్ చేసి చూపించి.. దాన్నే హిట్ చేశారు. దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన డాన్సర్లు కలిసి 'దేశీహాపర్స్' అనే బృందంగా ఏర్పడ్డారు.

శంతను మహేశ్వరి, మాసెడాన్ డిమెల్లో, నిమిత్ కొటియాన్ అనే ముగ్గురు కలిసి ముందుగా ఈ గ్రూపును ప్రారంభించారు. 'భారత్ మాతాకీ జై', 'గణపతి బప్పా మోరియా' అంటూ నినాదాలు చేయడంతో పాటు మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించారు. దాంతో ఈ బృందం ఛాంపియన్లుగా అవతరించడంతో పాటు.. 3.26 లక్షల రూపాయల చెక్కు, ట్రోఫీ కూడా అందుకున్నారు. దాంతోపాటు వాళ్లకు 'క్రౌడ్ ఫేవరెట్ ట్రోఫీ' కూడా వచ్చింది.

Advertisement
Advertisement