మా లేఖల వల్లే తెలంగాణ: నామా | In favour of state bifurcation due to TDP letter, says Nama Nageswara rao | Sakshi
Sakshi News home page

మా లేఖల వల్లే తెలంగాణ: నామా

Feb 19 2014 2:27 AM | Updated on Jul 11 2019 7:38 PM

మా లేఖల వల్లే తెలంగాణ: నామా - Sakshi

మా లేఖల వల్లే తెలంగాణ: నామా

లోక్‌సభలో రాష్ట్ర విభజన బిల్లుపై టీడీపీ తరఫున మొదటి ఓటు వేశామని ఆ పార్టీ నేత నామా నాగేశ్వరరావు చెప్పారు. తెలంగాణకు అనుకూలంగా 2008లో తమ పార్టీ లేఖ ఇచ్చిందని చెప్పారు.

సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభలో రాష్ట్ర విభజన బిల్లుపై టీడీపీ తరఫున మొదటి ఓటు వేశామని ఆ పార్టీ నేత నామా నాగేశ్వరరావు చెప్పారు. తెలంగాణకు అనుకూలంగా 2008లో తమ పార్టీ లేఖ ఇచ్చిందని చెప్పారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చి,కాంగ్రెస్ ను ఒప్పించి  రాష్ట్ర  ఏర్పాటుకు చంద్రబాబు కృషిచేశారని టీ-టీడీపీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ చెప్పారు.

మోత్కుపల్లి నర్సింహులు హైదరాబాద్‌లో మాట్లాడుతూ టీడీపీ ఇచ్చిన లేఖ వల్లే తెలంగాణ ఏర్పాటు సాధ్యమైందని చెప్పారు. కాగా, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు హరికృష్ణ మాట్లాడుతూ తాను రాజీనామా చేసినపుడే ఎంపీలందరూ రాజీనామా చేసి ఉంటే పరిస్థితి ఇంత వరకూ వచ్చి ఉండేది కాదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement