మాట వినలేదని మార్కుల్లో కోత | Hear the word of the cut marks | Sakshi
Sakshi News home page

మాట వినలేదని మార్కుల్లో కోత

Jul 14 2015 1:29 AM | Updated on Oct 16 2018 3:26 PM

తన మాట వినలేదని ముగ్గురు మెడిసిన్ విద్యార్థులకు ఓ ప్రొఫెసర్ ప్రాక్టికల్స్‌లో కోత విధించినట్లు బాధిత విద్యార్థులు ....

ముగ్గురు పీజీ వైద్య విద్యార్థులు ప్రాక్టికల్స్‌లో ఫెయిల్

హైదరాబాద్: తన మాట వినలేదని ముగ్గురు మెడిసిన్ విద్యార్థులకు ఓ ప్రొఫెసర్ ప్రాక్టికల్స్‌లో కోత విధించినట్లు బాధిత విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ప్రొఫెసర్ నిర్వాకం వల్ల ఓ విద్యార్ధిని సూపర్‌స్పెషాలిటీ సీటును కోల్పోయింది. దీంతో బాధితులు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ వీసీకి ఫిర్యాదు చేశారు.  సిద్ధార్థ కళాశాలలోని ముగ్గురు విద్యార్థులకు ఈ దుస్థితి ఎదురైంది. వారికి  థియరీ మార్కుల్లో మంచి పర్సెంటేజీ సాధిం చినా... ప్రాక్టికల్స్‌కొచ్చేసరికి అనుత్తీర్ణులయ్యారు.

300 మార్కులకు కేవలం 127 మార్కులే వేశారు. ఇందులో ఓ విద్యార్థినికి జాతీయస్థాయి సూపర్ స్పెషాలిటీ పరీక్షలో సీఎంసీ వెల్లూర్‌లో డీఎం న్యూరాలజీ విభాగంలో ఏపీ నుంచి ఈమె ఒక్కరికే సీటొచ్చింది. కానీ సీటును కోల్పోవాల్సి వచ్చింది. దీనిపై హెల్త్‌వర్సిటీ వైస్‌చాన్స్‌లర్ డా.రవిరాజుకు ఫిర్యాదు చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement