మార్చి 30వ తేదీ టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ బర్త్ డే
మార్చి 30 టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ బర్త్ డే. తొలిసినిమా జయంతో హిట్‌కొట్టడమే కాదు, ఉత్తమ నూతన తెలుగు నటుడుగా దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డ్ నుఅందుకున్న నితిన్ దిల్, సై, ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే లాంటి యూత్‌పుల్ , ప్రేమకథా చిత్రాలతో యూత్ స్టార్ ఇమేజ్ కొట్టేశాడు. అనంతరం అ.. ఆ అనే ఫామిలీ ఎంటర్ టైనర్ హిట్‌కొట్టి ఫ్యామిలీ హీరోగా పేరుకొట్టేశాడు.. వరుస సినిమాలతో హ్యాపీ మూడ్‌లో ఉన్న నితిన్‌కు హ్యపీ బర్తడే విషెస్ సందేశాలు ట్విట్టర్ లో మొదలయ్యాయి.
ఈ ఏడాది వరసగా మూడు సినిమాలకు సైన్ చేసిన నితిన్ రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. హను రాఘవపూడితో చేస్తున్న మూవీ ఇప్పటికే షూటింగ్ లో ఉంది. ఈ చిత్రానికి లై అనే టైటిల్ ఫిక్స్ చేసి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. టాలీవుడ్ నటుడు వెన్నెల కిషోర్ ఈ ఫోటోను పోస్ట్ చేసిన నితిన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశాడు. మరి మనం కూడా ఈ నిజామాబాద్ అందగాడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పేద్దాం. కెరీర్ లో మరిన్నివిజయాలను సొంతం చేసుకోవాలని కోరుకుంటూ.. ఎ వెరీ హ్యాపీ బర్తడే టూ యూ.. రాహుల్.. సారీ..నితిన్..
మరోవైపు 14 రీల్స్ ఎంటర్‌టైన్ పతాకంపై హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ ఫస్ట్ లుక్ ను ఈ రోజు రిలీజ్ చేయనున్నట్టు ఉగాది సందర్భంగా నితిన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. కాగా గత ఏడాది నితిన్ పుట్టిన రోజు సందర్భంగా టాలీవుడ్ క్వీన్ సమంత చేసిన అల్లరి గుర్తుందా. త్వరలోనే పెళ్లి చేసుకోబోయే నితిన్‌కి హ్యాపీ బర్త్ డే అంటూ ట్వీట్ చేయడం హాట్ టాపిక్ అయింది.
Touchdown U.S.A for a 70day long schedule here for @hanurpudi n @14reelsofficial film..1st look on 30th march.. HAPPY UGADI friends.. pic.twitter.com/ZQdaGKLYln
— nithiin (@actor_nithiin) March 29, 2017
Nithiin gariki janma dina shubhakankshalu