బంగారం అక్రమ రవాణాను నిరోధించేందుకు కేంద్రం కసరత్తులు చేస్తోంది.
బంగారం అక్రమ రవాణాపై కేంద్రం చర్యలు
Oct 16 2014 5:30 PM | Updated on Sep 2 2017 2:57 PM
హైదరాబాద్: బంగారం అక్రమ రవాణాను నిరోధించేందుకు కేంద్రం కసరత్తులు చేస్తోంది. భారత్ లో బంగారాన్ని విపరీతమైన డిమాండ్ ను ఆసరాకు చేసుకుంటున్న ముఠాల గుట్టురట్టు చేసేందుకు నడుంబిగించింది. ఇందులో భాగంగానే అంతర్జాతీయ విమానాశ్రయాలు, భూగర్భ, వాయు సరిహద్దులపై దృష్టి సారించాలని డీఆర్ఐకి ఆదేశాలు జారీ చేసింది. బంగారం తరలింపు మూడు రెట్లు పెరగడంతో ఆందోళన వ్యక్తం చేసిన భారత్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఏప్రిల్-ఆగస్టు మధ్య 1780 కేసులు నమోదైయ్యాయి. ఈ క్రమంలోనే రూ.470 కోట్ల విలువైన బంగారం కస్టమ్స్, డీఆర్ఐ అధికారులు సీజ్ చేశారు. పండుగల సీజన్ పురస్కరించుకుని బంగారం అక్రమ తరలింపు అధికంగా ఉన్న నేపథ్యంలో భారత్ దానికి అడ్డుకట్టవేసేందుకు చర్యలు చేపట్టింది.
Advertisement
Advertisement