'ఇరాక్‌లోని భారతీయ బందీలు క్షేమమే' | Government to ensure safe return of Indians from Iraq, says Sushma Sawraj | Sakshi
Sakshi News home page

'ఇరాక్‌లోని భారతీయ బందీలు క్షేమమే'

Aug 5 2014 5:01 PM | Updated on Sep 2 2017 11:25 AM

ఇరాక్‌లోని మోసుల్ నగరంలో మిలిటెంట్ల చెరలో బందీగా ఉన్న 41 మంది భారతీయులను విడిపించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నట్లు విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ తెలిపారు.

న్యూఢిల్లీ: ఇరాక్‌లోని మోసుల్ నగరంలో మిలిటెంట్ల చెరలో బందీగా ఉన్న 41 మంది భారతీయులను విడిపించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నట్లు విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ తెలిపారు. సోమవారం ఆమె రాజ్యసభలో సావధాన తీర్మానంపై చర్చ సందర్భంగా మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. మిలిటెంట్లవద్ద బందీగా ఉన్న భారతీయులు క్షేమంగానే ఉన్నట్టు తమకు సమాచారం అందిందని చెప్పారు. బిడ్డలకోసం ఎదురుచూసే తల్లిలా తాను వారి విడుదలకోసం వేచిచూస్తున్నానని సుష్మా అన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement