రెండు నెలల్లో 300కు పైగా ఫ్లాట్స్ విక్రయం | Godrej Properties sells over 300 apartments in Pune project | Sakshi
Sakshi News home page

రెండు నెలల్లో 300కు పైగా ఫ్లాట్స్ విక్రయం

Jan 4 2017 10:34 AM | Updated on Sep 5 2017 12:24 AM

ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్ గోద్రెజ్ ప్రాపర్టీస్ లిమిటెడ్ పునేలో భారీ అమ్మకాలను సాధించిందింది.


ముంబై:  ప్రముఖ  రియల్ ఎస్టేట్ డెవలపర్ గోద్రెజ్ ప్రాపర్టీస్ లిమిటెడ్  పునేలో  భారీ అమ్మకాలను సాధించింది. ప్రాజెక్టు ప్రారంభించిన కేవలం స్వల్ప కాలంలోనే సుమారు75 శాతం విక్రయాలను నమోదు చేసింది. ఉంద్రిలోని  31 ఎకరాల  రెసిడెన్షియల్ డెవలప్ మెంట్ లో  భాగంగా 10 ఎకరాల విస్తరించిన గోద్రెజ్ గ్రీన్స్ ప్రాజెక్టులో  2, 3 బెడ్ రూమ్  ఫ్లాట్లను  విక్రయిస్తోంది.
ముంబై ఆధారిత  ప్రముఖ  రియల్ ఎస్టేట్ డెవలపర్ గోద్రెజ్ ప్రాపర్టీస్ లిమిటెడ్   పూనే లో గోద్రెజ్ గ్రీన్స్  ప్రాజెక్ట్ కు చెందిన  300 అపార్ట్  మెంట్లను విక్రయించింది.  మొత్తం 400 ఫ్లాట్స్ లో ఇది 75 శాతమని గోద్రెజ్ ప్రాపర్టీస్ మేనేజింగ్ డైరెక్టర్ సీఈవో  పిరోజ్ షా గోద్రెజ్ చెప్పారు. పుణే తమకు కీలకమైన ప్రాంతమని, భవిష్యత్తులో మరింత విజయాన్ని సాధించనున్నామని ఆశిస్తున్నట్టు తెలిపారు.  తమ వినియోగదారులు అసాధారణమైన, వినూత్నమైన  ప్రాజెక్ట్ అందించేందుకు కృషి చేస్తాన్నామన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement