పెళ్లి వద్దందని.. రూ. 16 లక్షల జరిమానా! | girl fined rs 16 lakhs for annuling child marriage | Sakshi
Sakshi News home page

పెళ్లి వద్దందని.. రూ. 16 లక్షల జరిమానా!

May 12 2015 5:58 PM | Updated on Sep 3 2017 1:54 AM

పెళ్లి వద్దందని.. రూ. 16 లక్షల జరిమానా!

పెళ్లి వద్దందని.. రూ. 16 లక్షల జరిమానా!

చిన్ననాడు కుదిర్చిన పెళ్లిని రద్దు చేసుకోవాలని చెప్పినందుకు రాజస్థాన్లోని పంచాయతీ పెద్దలు ఆగ్రహించి.. ఓ యువతికి ఏకంగా రూ. 16 లక్షల జరిమానా విధించారు.

చిన్ననాడు కుదిర్చిన పెళ్లిని రద్దు చేసుకోవాలని చెప్పినందుకు రాజస్థాన్లోని పంచాయతీ పెద్దలు ఆగ్రహించి.. ఓ యువతికి ఏకంగా రూ. 16 లక్షల జరిమానా విధించారు. ఆమె కుటుంబానికి కుల బహిష్కరణ శిక్ష కూడా విధించారు.  జోధ్పూర్ తాలూకా రోహిచాన్ ఖుర్ద్ గ్రామానికి చెందిన శాంతాదేవి మేఘ్వాల్ అనే యువతికి 11 నెలల వయసు ఉండగానే పెళ్లి నిశ్చయం చేసేశారు.

ఆ విషయం ఆమెకు మూడేళ్ల క్రితమే తెలిసింది. ప్రస్తుతం కాలేజిలో చదువుతున్న ఆమె.. ఈ పెళ్లి తనకు వద్దని చెప్పింది. దాంతో ఆమె అత్తమామలకు కోపం వచ్చి.. పంచాయతీ పెద్దల వద్దకు వివాదాన్ని తీసుకెళ్లారు. పంచాయతీ పెద్దలు ఆమెకు రూ. 16 లక్షల జరిమానా విధించి,  ఆమె కుటుంబాన్ని కులం నుంచి వెలేశారు. దీనిపై న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు సాయం కోసం ఆమె ప్రయత్నిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement