బీఎస్‌ఎన్‌ఎల్‌ నూతన ఆఫర్‌ | free data offer for BSNL postpaid customers | Sakshi
Sakshi News home page

బీఎస్‌ఎన్‌ఎల్‌ నూతన ఆఫర్‌

Mar 1 2017 10:37 AM | Updated on Sep 5 2017 4:56 AM

బీఎస్‌ఎన్‌ఎల్‌ నూతన ఆఫర్‌

బీఎస్‌ఎన్‌ఎల్‌ నూతన ఆఫర్‌

బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పోస్ట్‌పెయిడ్‌ వినియోగదారులకు కొత్త ప్లాన్‌ ఆఫర్లను ప్రకటించింది.

సాక్షి, సిటీబ్యూరో: బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పోస్ట్‌పెయిడ్‌ వినియోగదారులకు కొత్త ప్లాన్‌ ఆఫర్లను ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం తెలంగాణ టెలికం సర్కిల్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ ఎల్‌.అనంతరామ్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్‌–799 (దిల్‌ ఖోల్‌ కే బోల్‌). ఈ ప్లాన్‌ నెలసరి చార్జి రూ.799. అన్‌ లిమిటెడ్‌ వాయిస్‌ కాల్స్, 6జీబీ ఉచిత డాటా మొదటి నాలుగు నెలల తదుపరి నెలకు 3జీబీ ఉచిత డాటా.

మొదటి నాలుగు నెలలకు నెలసరి అద్దె రూ.599లకు తగ్గించారు. అధిక డాటా ఆఫర్‌ ప్లాన్‌–1125లో 10జీబీ ఉచిత డాటా, ప్లాన్‌–1525లో 30జీబీ ఉచిత డాటా, ప్రమోషనల్‌ ఆఫర్‌గా ప్రస్తుత కొత్త వినియోగదారులకు మూడు నెలల పాటు వర్తిస్తుంది. వివరాలకు 1503 లేదా 18001801503 నంబర్లలో సంప్రదించొచ్చు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement