జ్రాయెల్ మాజీ ప్రధాని ఏరియెల్ షరాన్ (85) శనివారం టెల్ హషోమర్‌లోని ఆస్పత్రిలో మృతి చెందారు.
జెరూసలెం: ఇజ్రాయెల్ మాజీ ప్రధాని ఏరియెల్ షరాన్ (85) శనివారం టెల్ హషోమర్‌లోని ఆస్పత్రిలో మృతి చెందారు. అస్వస్థతతో బాధపడుతున్న ఆయన గుండెపోటుతో మరణించారు. 2001లో ప్రధాని అయిన షరాన్, 2006లో అస్వస్థతకు లోనై, కోమాలోకి చేరుకునేంత వరకు పదవిలో ఉన్నారు. 2003లో ఆయన భారత పర్యటనకు వచ్చారు. భారత్‌లో పర్యటించిన తొలి ఇజ్రాయెల్ ప్రధాని ఆయనే.