షాపూర్‌లో అకౌంటెంట్‌పై కాల్పులు | firing in apartment atajeedimetla | Sakshi
Sakshi News home page

షాపూర్‌లో అకౌంటెంట్‌పై కాల్పులు

Sep 9 2015 10:05 AM | Updated on Oct 2 2018 2:30 PM

షాపూర్‌లో అకౌంటెంట్‌పై కాల్పులు - Sakshi

షాపూర్‌లో అకౌంటెంట్‌పై కాల్పులు

నగరంలోని జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని షాపూర్‌లో మంగళవారం రాత్రి కాల్పులు కలకలం సృష్టించాయి.

హైదరాబాద్: నగరంలోని జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని షాపూర్‌లో మంగళవారం రాత్రి కాల్పులు కలకలం సృష్టించాయి.  రఘుశర్మ(56) అనే వ్యక్తిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి అనంతనం కాల్పులు జరిపారు. వివరాలు..రఘు శర్మ అకౌంటెంట్ గా పనిచేస్తున్నాడు. డ్యూటీ ముగించుకుని షాపూర్‌లోని ఉషోదయ టవర్స్‌లో ఉన్న తనఫ్లాట్‌కు వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. బైక్‌ పై వచ్చిన ముగ్గురు దుండగులు రఘు తలపై రాడ్‌తో బలంగా కొట్టడంతో తీవ్రగాయాలయ్యాయి.

అక్కడే ఉన్న మరో వ్యక్తి ప్రతిఘటించడంతో దుండగులు తుపాకీతో కాల్పులు జరిపారు. కాల్పులు నుంచి రఘు తప్పించుకోవడంతో ప్రమాదం తప్పింది. అనంతరం దుండగులు రఘు చేతిలో ఉన్న బ్యాగు తీసుకుని పరారయ్యారు. బ్యాగులో టిఫిన్ బాక్సు తప్పితే ఏమీలేదని బాధితుడు తెలిపాడు. బాధితుడ్ని షాపూర్‌లోని ఓ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు సంఘటనాస్థలం నుంచి ఓ బుల్లెట్‌ను స్వాధీనం చేసుకున్నారు.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement