
బడుగుల మురికివాడల్లో భగ్గుమన్న మంటలు
దేశ రాజధాని న్యూఢిల్లీలోని సదర్ బజార్ సమీపంలో ఉన్న మురికివాడల్లో సోమవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
మొదట 15 ఫైర్ టెండర్స్ రంగంలోకి దిగినా మంటలు అదుపులోకి రాకపోవడంతో ఏకంగా 30 ఫైర్ టెండర్స్ అగ్నికీలలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. భారీ మంటలు, దట్టమైన పొగలతో ఇక్కడి మురికివాడ భీతావహం కనిపిస్తోంది.

