ఓటమి భయంతోనే మున్సిపల్ చట్ట సవరణ | Fear of defeat with Municipal law Modification | Sakshi
Sakshi News home page

ఓటమి భయంతోనే మున్సిపల్ చట్ట సవరణ

Jan 6 2016 3:11 AM | Updated on Sep 3 2017 3:08 PM

గ్రేటర్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే మున్సిపల్ చట్టానికి రాష్ట్ర ప్రభుత్వం సవరణలు చేసిందని టీపీసీసీ అధికార ప్రతినిధులు పి.కమలాకర్‌రావు, జి.నిరంజన్ విమర్శించారు.

టీపీసీసీ అధికార ప్రతినిధులు పి.కమలాకర్‌రావు, జి.నిరంజన్
 సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే మున్సిపల్ చట్టానికి రాష్ట్ర ప్రభుత్వం సవరణలు చేసిందని టీపీసీసీ అధికార ప్రతినిధులు పి.కమలాకర్‌రావు, జి.నిరంజన్ విమర్శించారు. గాంధీభవన్‌లో బుధవారం వారు విలేకరులతో మాట్లాడుతూ చట్టానికి సవరణ చేయాలనుకుంటే ముందు అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేసి, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

డిసెంబర్ 5న, 29న జరిగిన అఖిలపక్ష భేటీల్లోనూ చట్ట సవరణ ప్రస్తావన చేయలేదన్నారు. ఏ పార్టీ అభిప్రాయం తీసుకోకుండా హడావుడి నిర్ణయాలు చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. ఈ ఉత్తర్వులను ఉపసంహరించుకుని, యథాతథంగా ఎన్నికల్ని నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement