పురిటి నొప్పులతో విమానం దించివేత | Dubai bound flight makes emergency landing at Chennai airport | Sakshi
Sakshi News home page

పురిటి నొప్పులతో విమానం దించివేత

Jun 17 2015 12:28 PM | Updated on Sep 3 2017 3:53 AM

పురిటి నొప్పులతో విమానం దించివేత

పురిటి నొప్పులతో విమానం దించివేత

దుబాయిలోని ఓ ప్రైవేటు సంస్థకు చెందిన విమానాన్ని అత్యవసరంగా దించివేశారు. ప్రయాణీకుల్లో ఓ మహిళకు పురిటి నొప్పులు రావడంతో చెన్నై విమానాశ్రయంలో దించివేశారు.

చెన్నై: దుబాయిలోని ఓ ప్రైవేటు సంస్థకు చెందిన విమానాన్ని అత్యవసరంగా దించివేశారు. ప్రయాణీకుల్లో ఓ మహిళకు పురిటి నొప్పులు రావడంతో చెన్నై విమానాశ్రయంలో దించివేశారు. అనంతరం ఓ వైద్య సహాయకురాలిని ఇచ్చి స్థానిక ఆస్పత్రికి తరలించారు. దుబాయికి చెందిన ఈ విమానం ఇండోనేషియా నుంచి వస్తుండగా ఆమె తనకు నొప్పులు వస్తున్నాయని చెప్పడంతో చెన్నైలో ఆపేయాల్సి వచ్చింది. మొత్తం 300 మంది ప్రయాణీకులు ఇందులో ఉన్నారు. మహిళను సురక్షితంగా దింపేసిన అనంతరం విమానం బయలు దేరింది. సదరు మహిళను గురువారం వేరే విమానంలో పంపిస్తామని అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement