'పన్నీర్ సెల్వం పేరెత్తడమే ఇష్టం లేదు' | do not want to take panneer selvam name, says cr saraswathi | Sakshi
Sakshi News home page

'పన్నీర్ సెల్వం పేరెత్తడమే ఇష్టం లేదు'

Feb 8 2017 12:51 PM | Updated on Sep 5 2017 3:14 AM

'పన్నీర్ సెల్వం పేరెత్తడమే ఇష్టం లేదు'

'పన్నీర్ సెల్వం పేరెత్తడమే ఇష్టం లేదు'

తమిళనాడులో దివంగత ముఖ్యమంత్రి జయలలితను నమ్మినవాళ్లంతా ఇప్పుడు శశికళ వెంటే ఉన్నారని అన్నాడీఎంకే పార్టీ అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతి అన్నారు.

తమిళనాడులో దివంగత ముఖ్యమంత్రి జయలలితను నమ్మినవాళ్లంతా ఇప్పుడు శశికళ వెంటే ఉన్నారని అన్నాడీఎంకే పార్టీ అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతి అన్నారు. అన్నాడీఎంకే కార్యాలయమే తమ ఇల్లని, పన్నీర్ సెల్వం పేరు ఎత్తడమే తమకు ఇష్టం లేదని తెలిపారు. 
 
పార్టీని చీల్చాలని చూస్తున్నవాళ్ల గురించి తాము పట్టించుకునేది లేదని చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటు, ప్రమాణ స్వీకారం గురించి చిన్నమ్మ మాట్లాడతారని తెలిపారు. ఇన్నాళ్లుగా పన్నీర్ సెల్వం చాలా మంచివాడనే అనుకున్నామని, కానీ ఇంత స్వార్థపరుడని ఇప్పుడే తెలిసిందని ఆమె వ్యాఖ్యానించారు. తమిళ హాస్యనటుడు వడివేలుతో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వాన్ని ఆమె పోల్చారు. నిజంగా అమ్మకు ఆయన విశ్వాసపాత్రుడే అయితే.. ఇదంతా చేయకుండా సైలెంట్‌గా ఉంటారన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement