పెరిగిన పన్ను వసూళ్లు | Direct tax mop-up rises 15 per cent to Rs 1.89 lakh crore in April-August | Sakshi
Sakshi News home page

పెరిగిన పన్ను వసూళ్లు

Sep 12 2016 3:51 PM | Updated on Sep 4 2017 1:13 PM

ఏప్రిల్-ఆగస్టు కాలంలో నికర ప్రత్యక్ష, పరోక్ష పన్ను వసూళ్లు వివరాలను సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ టాక్సెస్‌(సీబీడీటీ)విడుదల చేసింది.

న్యూఢిల్లీ:  ఏప్రిల్-ఆగస్టు కాలంలో నికర ప్రత్యక్ష, పరోక్ష పన్ను వసూళ్లు వివరాలను  సెంట్రల్‌ బో ర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ టాక్సెస్‌ (సీబీడీటీ) విడుదల చేసింది.   ఏప్రిల్-ఆగస్టు కాలానికి నికర పరోక్ష పన్నుల వసూళ్లు  పెరిగాయని  సీబీడీటీ  సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.  ప్రత్యక్ష పన్నుల(కార్పొరేట్ ఆదాయ పన్ను, వ్యక్తిగత ఆదాయ పన్ను) వసూళ్ళు 15 శాతం వృద్ధితో రూ 1.89లక్షల కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి ఇది రూ 1.03 లక్షల కోట్లుగా ఉంది. సెంట్రల్ ఎక్సైజ్, సర్వీస్ టాక్స్, కస్టమ్స్  కలగలసిన పరోక్ష పన్నులు 27.5 శాతం వృద్ధితో రూ.3.36 లక్షల కోట్లను సాధించినట్టు తెలిపింది.

సర్వీస్ టాక్స్ నికర వసూళ్లు 23.2 శాతం పెరిగి  రూ.92,696 కోట్లుగా ఉంది. ఇది గత ఏడాది ఇది రూ.75,219కోట్లు.   కస్టమ్స్ వసూళ్లు 5.7 వృద్ధితో రూ. 90,448 కోట్లు. గత ఏడాది ఇదే కాలానికి ఇది రూ.85,557 కోట్లుగా ఉంది.
మరోవైపు ప్రభుత్వం 2016-17 ఆర్థిక సంవత్సరంలో  పరోక్ష (కస్టమ్స్, ఎక్సైజ్, సర్వీస్ టాక్స్)  7,79 లక్షల కోట్లు,   ప్రత్యక్ష పన్నుల వసూళ్ల రూపంలో  రూ 8.47 లక్షల కోట్ల రూపాయలను వసూలు చేయాలని భావిస్తోంది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement