'ఆ రెండు' నగరాలు చవకైనవి | Delhi and Mumbai are among the cheapest cities in the world to live in, according to a report by Swiss Bank UBS. | Sakshi
Sakshi News home page

'ఆ రెండు' నగరాలు చవకైనవి

Sep 19 2015 9:50 AM | Updated on Sep 3 2017 9:38 AM

'ఆ రెండు' నగరాలు చవకైనవి

'ఆ రెండు' నగరాలు చవకైనవి

ప్రపంచంలోనే అత్యంత వ్యయపూరిత నగరాల్లో లండన్ ఐదో స్థానంలో ఉంది.

ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే ఇక్కడ వేతనాలు బాగా తక్కువ
బల్గేరియా రాజధాని సోఫియాలో మనుగడ మహా సులువు
లండన్.. .అత్యంత వ్యయభరితం
తగినన్ని ఇళ్లు లేక పెరిగిన కిరాయిలు

లండన్: ప్రపంచంలోనే అత్యంత వ్యయపూరిత నగరాల్లో లండన్ ఐదో స్థానంలో ఉంది. అయితే ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే ఇక్కడ వేత నాలు మాత్రం ఆ స్థాయిలో లేవు. ఇక మన దేశానికొస్తే కారు చౌక నగరాల్లో ముంబై, ఢిల్లీ ఉన్నాయి. ఈ విషయం స్విట్జర్లాండ్ బ్యాంకు యూబీఎస్ ఇటీవల చేసిన అధ్యయనంలో తేలింది. వస్తువుల ధరలు, అద్దెలతో పోల్చినపుడు జ్యూరిచ్, జెనీవా, న్యూయార్క్, ఓస్లోల కంటే లండన్ వెనుకబడిపోయింది. ఇక స్థూల వేతనాలకొచ్చేసరికి 13వ స్థానంలో నిలిచింది. లండన్ కంటే సిడ్నీ, కోపెన్‌హాగన్, చికాగోలలో సులువుగా మనుగడ సాగించొచ్చు.

ఈ మూడు నగరాల ప్రజల రాబడి లండన్‌వాసులకంటే ఎక్కువ. నివాసాల కిరాయిల పెరుగుదల లండన్‌వాసుల జీవన వ్యయంపై తీవ్ర ప్రభావం చూపింది. ఇందువల్ల వారి జీవన వ్యయం బాగా పెరిగిపోయింది. పైగా బ్రిటన్ ప్రభుత్వం అవసరాలకు సరిపడా ఆవాసాలను నిర్మించకపోవడం కిరాయిలు పెరిగిపోయేలా చేసింది. ఇతర దేశాలనుంచి లండన్‌కు వలసలు పెరగడం, ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నవారు డబ్బును ఆదా చేసుకునేందుకు అందులోనే సుదీర్ఘకాలం ఉండిపోవడం ఆస్తుల అద్దెలు ఆకాశాన్నంటుకునేలా చేశాయి. 2007-08 ఆర్థిక సంక్షోభం తర్వాత ద్రవ్యోల్బణంతో పోలిస్తే రాబడి అత్యంత నిదానంగా పెరిగింది.

39 రకాల ఆహార పదార్థాల సగటు ధరలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు యూరప్‌లోని రాజధాని నగరాలైన పారిస్, బెర్లిన్‌లతో పోలిస్తే  లండన్‌లోనే జీవన వ్యయం బాగా ఎక్కువగా ఉంది. అయితే జ్యూరిచ్, సియోల్, న్యూయార్క్ అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో ఉన్నాయి. లండన్ వాసి ఓ ఐ ఫోన్ కొనుగోలు చేయాలంటే అతడు కనీసం 41.2 గంటలపాటు పని చేయాల్సి ఉంటుంది. అదే జ్యూరిచ్‌వాసి అయితే 20. 6 గంటలు పనిచేస్తే సరిపోతుందని ఈ అధ్యయనంలో తేలింది. లండన్‌లో బ్రెడ్ ధర బాగా తక్కువ. ఇక్కడ ఆరు నిమిషాలపాటు పనిచేస్తే చాలు...తినడానికి ఏమైనా కొనుగోలు చేయొచ్చు.

ఇక న్యూయార్క్‌లో అయితే మూడు నిమిషాలు పనిచేసినా కడుపు ఆకలితో నకనకలాడాల్సిన పని ఉండదు. జీవన వ్యయం అత్యంత తక్కువగా ఉండే నగరాల విషయానికొస్తే బల్గేరియాలోని సోఫియా తొలి స్థానంలో నిలుస్తుంది. ఆ తర్వాతి స్థానంలో రొమేనియాలోని బుఖారెస్ట్, భారత్‌లోని ముంబై, ఢిల్లీ నిలిచాయి. ప్రపంచంలోని 71 ప్రాంతాలతో పోలిస్తే ఈ రెండు నగరాల్లో వేతనాలు బాగా తక్కువ.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement