ఆంధ్రప్రదేశ్‌ను బలవంతంగా విడదీసిన కాంగ్రెస్, బీజేపీలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించడంలో విఫలమైయ్యాయని
సీపీఐ నేత నారాయణ ధ్వజం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ను బలవంతంగా విడదీసిన కాంగ్రెస్, బీజేపీలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించడంలో విఫలమైయ్యాయని సీపీఐ కేంద్ర కార్యదర్శివర్గ సభ్యుడు నారాయణ ధ్వజమెత్తారు. పార్లమెంటులో రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లును ఆమోదించే సందర్భంలో కాంగ్రెస్, బీజేపీలు పోటాపోటీగా ప్రత్యేక హోదాపై హామీలు ఇచ్చి ఇప్పుడు తప్పించుకుంటున్నాయన్నారు.
ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి లేఖ అందజేసినట్టు నారాయణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.