బాబా రాందేవ్‌ను అరెస్టు చెయ్యాలి | Congress Workers demand for Baba Ramdev Arrest | Sakshi
Sakshi News home page

బాబా రాందేవ్‌ను అరెస్టు చెయ్యాలి

Apr 29 2014 10:06 PM | Updated on Sep 2 2017 6:42 AM

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై యోగా గురువు బాబా రాందేవ్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి.

ఠాణే: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై యోగా గురువు బాబా రాందేవ్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. నవీముంబైలో కాంగ్రెస్ కార్యకర్తలు మంగళవారం రాందేవ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం నవీముంబై కాంగ్రెస్ అధ్యక్షుడు దశరత్ భగత్ మాట్లాడుతూ... వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాందేవ్ బాబాను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ ఆందోళనలో స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలతోపాటు ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థి విభాగం సభ్యులు కూడా పాల్గొన్నారు. ఠాణే జిల్లా ఎన్‌ఎస్‌యూఐ ఉపాధ్యక్షుడు రాహుల్ త్రైంబకే, ప్రధాన కార్యదర్శి మనోజ్ మహారాణలు మాట్లాడుతూ... బాబా రాందేవ్ బీజేపీ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారని, దళితులను అవమానపర్చేలా మాట్లాడుతున్నారని, వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆయనను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement