సీమాంధ్ర ప్రజలకు మేలు చేసేలా కాంగ్రెస్ పార్టీ చేసిన సవరణలనే బీజేపీ కాపీ కొట్టిందని కేంద్ర మంత్రి జేడీ శీలం విమర్శించారు.
బీజేపీపై కేంద్ర మంత్రి జేడీ శీలం ధ్వజం
సాక్షి, న్యూఢిల్లీ: సీమాంధ్ర ప్రజలకు మేలు చేసేలా కాంగ్రెస్ పార్టీ చేసిన సవరణలనే బీజేపీ కాపీ కొట్టిందని కేంద్ర మంత్రి జేడీ శీలం విమర్శించారు. ‘‘ సీమాంధ్రలో రెవెన్యూ లోటుకు సం బంధించి రూ.10వేల కోట్లు ఇవ్వాలని, ఈశాన్య రాష్ట్రాల మాదిరే ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తి ఇస్తామని లోక్‌సభలో బిల్లు ఆమోదానికి ముందురోజే రాహుల్‌గాంధీ మాకు హామీ ఇచ్చారు. అయితే అప్పటికే వాటిని పొందుపరచడంలో ఆలస్యం జరగడంతో లోక్‌సభలో ఈ సవరణలు పెట్టలేదు. రాజ్యసభలో బిల్లు సందర్భంగా పెడతామని చెప్పారు. ఈ సవరణలనే బీజేపీ కాపీ కొట్టి సీమాంధ్ర ప్రజల కోసం పోరాడుతున్నట్లుగా మొసలికన్నీరు కారుస్తోంది’’ అని శీలం విమర్శించారు. సీమాంధ్ర ప్రజలపై బీజేపీకి నిజంగా ప్రేమ ఉంటే హైదరాబాద్‌ను పదేళ్లపాటు యూటీగా చేయాలన్న డిమాండ్‌కు ఎందుకు అంగీకరించలేదని ఆయన ప్రశ్నించారు. సీమాంధ్రుల సమస్యలను పరిష్కరించేందుకు కంకణబద్ధులమై ఉన్నామని, రెండు ప్రాంతాల వారు అభివృద్ధి చెందేలా కృషిచేస్తామని జేడీశీలం భరోసా ఇచ్చారు.