
సీఎం రమేష్ వర్గానికి లైన్ క్లియర్
ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ సంఘం గుర్తింపు విషయంలో టీడీపీ ఎంపీ సీఎం రమేష్ వర్గానికి ఊరట లభించింది.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ సంఘం గుర్తింపు విషయంలో టీడీపీ ఎంపీ సీఎం రమేష్ వర్గానికి ఊరట లభించింది. ఒలింపిక్ సంఘాల గుర్తింపు వివాదంలో పురుషోత్తంనాయుడు వేసిన పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది.
టీడీపీకే చెందిన మరో ఎంపీ గల్లా జయదేవ్ వర్గం తరపున పురుషోత్తం నాయుడు పిటిషన్ దాఖలు చేశారు. ఏపీ ఒలింపిక్ సంఘం పగ్గాల కోసం సీఎం రమేష్, గల్లా జయదేవ్ వర్గాలు పోటీపడిన సంగతి తెలిసిందే. తమదే నిజమైన ఎన్నికని ఇరు వర్గాలు ప్రకటించుకున్నాయి. తాజాగా హైకోర్టు పురుషోత్తంనాయుడి పిటిషన్ను తిరస్కరించడంతో రమేష్ వర్గానికి లైన్ క్లియరైంది.