కేంద్ర మంత్రి పదవికి చిరంజీవి రాజీనామా! | Chiranjeevi resigns as minister over Telangana decision | Sakshi
Sakshi News home page

కేంద్ర మంత్రి పదవికి చిరంజీవి రాజీనామా!

Oct 3 2013 10:10 PM | Updated on Sep 1 2017 11:18 PM

కేంద్ర మంత్రి పదవికి చిరంజీవి రాజీనామా!

కేంద్ర మంత్రి పదవికి చిరంజీవి రాజీనామా!

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలుపడాన్ని నిరసిస్తూ కేంద్ర టూరిజం శాఖ మంత్రి కె. చిరంజీవి గురువారం రాత్రి తన పదవికి రాజీనామా సమర్పించినట్టు సమాచారం

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలుపడాన్ని నిరసిస్తూ కేంద్ర టూరిజం శాఖ మంత్రి కె. చిరంజీవి గురువారం రాత్రి తన పదవికి రాజీనామా సమర్పించినట్టు సమాచారం. తన రాజీనామా లేఖను ప్రధానమంత్రి కార్యాలయానికి ఫ్యాక్ ద్వారా పంపినట్టు ఆయన వ్యక్తిగత కార్యదర్శి వెల్లడించారు. తెలంగాణ నోట్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన తర్వాత రాజీనామా చేయాలని నిశ్చయించుకున్నారు. 
 
గత రెండు నెలలుగా సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమకారుల ఆగ్రహానికి చిరంజీవి గురైన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ వర్కింగ్ కమిటి జూలై 30న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తీసుకున్న నిర్ణయానికి నిరసనగా చిరంజీవి రాజీనామా చేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని సీమాంధ్ర జేఏసీ నేతలు పలుమార్లు చేసిన డిమాండ్ చేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement