కెప్టెన్ కు భారీ మెజార్టీ | Captain Amrinder Singh has won from Patiala urban seat | Sakshi
Sakshi News home page

కెప్టెన్ కు భారీ మెజార్టీ

Mar 11 2017 12:48 PM | Updated on Aug 14 2018 9:04 PM

పంజాబ్‌ ఎన్నికల్లో కెప్టెన్ అమరీందర్ సింగ్ పోటీ చేసిన రెండు స్థానాల్లో ఒక దాంట్లో విజయం సాధించారు.

చండీగఢ్: పంజాబ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి అభ్యర్థి కెప్టెన్ అమరీందర్ సింగ్ పోటీ చేసిన రెండు స్థానాల్లో ఒక దాంట్లో విజయం సాధించారు. పాటియాలా(పట్టణ) నియోజకవర్గంలో విజయం సొంతం చేసుకున్నారు. 51 వేలకు పైగా ఓట్ల భారీ తేడాతో సమీప ప్రత్యర్ధి ఆర్మీ మాజీ చీఫ్‌ జేజే సింగ్‌ ను ఓడించారు.

లాంబి నియోజకవర్గంలో మాత్రం ఆయనకు చుక్కెదురైంది. అకాలీదళ్ అధినాయకుడు, ముఖ్యమంత్రి ప్రకాశ్‌ సింగ్ బాదల్ చేతిలో ఓటమి చవిచూశారు. తమ పార్టీ ఘన విజయం సాధించడంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు అమరీందర్ సింగ్ సన్నాహాలు చేసుకుంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement