అర్ధరాత్రి బుడ్డోడి సాహసం; వైరల్‌ వీడియో | boy fearlessness towards dogs; video goes viral | Sakshi
Sakshi News home page

అర్ధరాత్రి బుడ్డోడి సాహసం; వైరల్‌ వీడియో

May 28 2017 2:43 PM | Updated on Sep 5 2017 12:13 PM

అర్ధరాత్రి బుడ్డోడి సాహసం; వైరల్‌ వీడియో

అర్ధరాత్రి బుడ్డోడి సాహసం; వైరల్‌ వీడియో

ప్రమాదాన్ని పసిగట్టిన పూజ.. క్షణంలో పారిపోయింది. చందుకు మాత్రం ఆ ఛాన్స్‌ దక్కలేదు..

హైదరాబాద్‌: అర్ధరాత్రి. సమయం 12:40. చిన్నారులు పూజ- చందులు చేతిలో చెయ్యివేసుకుని చిన్న గల్లీలోకి ఎంటర్‌ అయ్యారు. కొద్ది దూరం నడిస్తే ఇల్లొచ్చేస్తుంది. కానీ అంతలోనే ఓ వీధికుక్కల గుంపు వారికేసి గుర్రుమంది. ప్రమాదాన్ని పసిగట్టిన పూజ.. క్షణంలో పారిపోయింది. చందుకు మాత్రం కుక్కలు ఆ ఛాన్స్‌ ఇవ్వలేదు. దూసుకొచ్చి చుట్టుముట్టాయి.
 
పెద్దవాళ్లుసైతం గజగజా వణికిపోయే ఆ పరిస్థితిలో చందూ సాహసం ప్రదర్శించాడు. కుక్కలను ఎదిరించి సురక్షితంగా బయటపడగలిగాడు. హైదరాబాద్‌లోని మూసాపేట్‌లో శనివారం రాత్రి చోటుచేసుకున​ ఈ సంఘటన అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అయింది.
 
మూసాపేట్‌లోని శ్రీకాకుళం బస్తీలో శనివారం రాత్రి ఓ పెళ్లి జరిగింది. పెళ్లింటి నుంచి రెండు వీధుల అవతలుండే సొంతింటికి వెళ్లే క్రమంలో చందు, పూజలు ఇలా ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. వీధికుక్కల నుంచి రక్షణకల్పించాల్సిందిగా స్థానికులు పలుమార్లు వేడుకున్నా అధికారులు స్పందిచడంలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement