 
													
ప్రొఫెషనల్ బాక్సర్ కావాలని కలలుకన్న స్కాటిష్ బాక్సర్ జోర్డాన్ కో (20) ఆసక్మిక మృతి తీవ్ర విషాదాన్ని నింపింది.
ప్రొఫెషనల్  బాక్సర్ కావాలని కలలుకన్న ఓ యువ బాక్సర్  ఆసక్మిక  మృతి తీవ్ర విషాదాన్ని నింపింది.   స్కాటిష్ బాక్సర్  జోర్డాన్ కో (20) తన కలల సాకారంలో భాగంగా  థాయిలాండ్ వెళ్లాడు.  అక్కడ బరువుతగ్గడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో  ఆదివారం ఉదయం  భారీ ట్రాక్ సూట్ లో శవమై తేలాడు.  తన తదుపరి పోరాటం కోసం ఒక నిర్దిష్ట  వెయిట్‌ను  చేరుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో అనూహ్యంగా థాయిలాండ్ లో మరణించడం కలకలం రేపింది.  అయితే వడదెబ్బతో చనిపోయాడని అధికారులు ప్రాథమికంగా అంచానా వేశారు.
జోర్డాన్ కో శనివారం రాత్రి మాంగ్  జిల్లా లో ఒక కంబోడియన్ బాక్సర్ తో తరపడాల్సి ఉంది.  ఈ పోటీ తరువాత అతను  గ్లాస్గో థాయ్ బాక్సింగ్ అకాడమీ పోటీల్లో పాల్గొనేందుకు   స్కాట్లాండ్ కు తిరిగి వస్తాడని అందరూ భావించారు.   కానీ  కోచ్  క్రైగ్ ఫ్లోన్ గ్లాస్గో   ఆదివారం  ఉదయం జోర్డాన్ మరణించాడనే సమాచారాన్ని అందించాడు. వడదెబ్బతో అతని చనిపోయినట్టుగా అధికారులు భావిస్తున్నారని తెలిపాడు.
అతని మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు నిధుల సేకరణకు ప్రయత్నిస్తున‍్నట్టు చెప్పారు.   మూడున్నర సంవత్సరాలు తనతో కలిసి పనిచేశాడని, తాజాగా   జోర్డాన్  ఒక ప్రొఫెషనల్ కావాలనే కోరికతో   థాయ్‌లాండ్‌కు వచ్చినట్టు చెప్పారు. ఇంతలోనే అతను కన్నుమూయడం విచారకరమన్నాడు.మరోవైపు జోర్డాన్ మరణం  పట్ల  థాయ్‌లాండ్  విదేశాంగ శాఖ ప్రతినిధి  సంతాపం వ్యక్తం చేశారు. ఈ కష్టకాలంలో   అతని కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించింది. 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
