సీపీఎం ఆఫీసులో బాంబులు స్వాధీనం | Bombs, sharp weapons recovered from CPI-M office in WB | Sakshi
Sakshi News home page

సీపీఎం ఆఫీసులో బాంబులు స్వాధీనం

Sep 16 2016 8:24 PM | Updated on Aug 13 2018 8:12 PM

పశ్చిమబెంగాల్లో దుర్గాపూర్లోని సీపీఎం కార్యాలయంలో బాంబులను, పదునైన ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

దుర్గాపూర్: పశ్చిమబెంగాల్లో దుర్గాపూర్లోని సీపీఎం కార్యాలయంలో బాంబులను, పదునైన ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం పోలీసులు పార్టీ కార్యాలయంలో సోదాలు చేయగా రెండు బ్యాగుల్లో దాచిన 15 నుంచి 20 బాంబులను గుర్తించారు.  7 పదునైన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని పోలీసులు చెప్పారు.

పార్టీ కార్యాలయంలో బాంబులను, ఆయుధాలను ఉంచిన ఘటనలో సీపీఎంకు సంబంధంలేని ఆ పార్టీ జోనల్ సెక్రటరీ పంకజ్ రాయ్ సర్కార్ చెప్పారు. పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్రపన్నారని ఆరోపించారు. కాగా ప్రజల్లో భయాందోళలు కలిగించడానికి సీపీఎం ఆయుధాలను సమకూర్చుకుందని ఐఎన్టీటీయూసీ నాయకుడు ప్రభాత్ ఛటర్జీ ఆరోపించారు.

Advertisement
 
Advertisement
Advertisement