వాణిజ్య రాజధాని ముంబయిలో ఈ నెల 17న మాంసం అమ్మకాలను నిషేధించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపట్ల హైకోర్టు స్టే విధించింది.
ముంబయి: వాణిజ్య రాజధాని ముంబయిలో ఈ నెల 17న మాంసం అమ్మకాలను నిషేధించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపట్ల హైకోర్టు స్టే విధించింది. ఆ రోజు జంతు వధ విషయంలో జోక్యం చేసుకొని అలాంటివి జరగకుండా చూడాలని దాఖలు చేసిన పిటిషన్లో జోక్యం చేసుకునేందుకు నిరాకరించారు.
2004లో కూడా రెండు రోజులపాటు మాంసం అమ్మకాలను నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయారని గుర్తు చేసింది. జైనుల పవిత్ర కార్యక్రమం పర్యుషాన్ సందర్భంగా తొలుత ఎనిమిది రోజులు మాంసం నిషేధించాలని, ఆతర్వాత నాలుగురోజులకు కుదించి, అప్పటికీ పలు వర్గాల నుంచి విమర్శలు రావడంతో తర్వాత రెండు రోజులకు చివరికి ఒకే రోజుకు మాంసాన్ని నిషేధించినా.. దానిపై కూడా హైకోర్టు స్టే విధించింది.