‘ఢిల్లీలో రాష్ట్రపతిపాలన’ | BJP leader said Modi-ji will soon impose the President's Rule in Delhi, says Alka Lamba | Sakshi
Sakshi News home page

‘ఢిల్లీలో రాష్ట్రపతిపాలన’

Apr 26 2017 11:55 AM | Updated on Sep 5 2017 9:46 AM

‘ఢిల్లీలో రాష్ట్రపతిపాలన’

‘ఢిల్లీలో రాష్ట్రపతిపాలన’

తమ పార్టీ ఎమ్మెల్యేలకు బీజేపీ గాలం వేస్తోందని ఆప్‌ ఎమ్మెల్యే అల్కా లంబా ఆరోపించారు.

న్యూఢిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) ఎమ్మెల్యేలకు బీజేపీ గాలం వేస్తోందని చాందినీ చౌక్‌ ఎమ్మెల్యే అల్కా లంబా ఆరోపించారు. పార్టీ ఫిరాయిస్తే తనకు లోక్‌సభ టికెట్‌ ఇస్తానని బీజేపీ బేరం పెట్టిందని ఆమె వెల్లడించారు. బీజేపీ మహిళా నేత షాజియా ఇల్మితో సమానంగా పార్టీలో హోదా కల్పిస్తామని ఆశ పెట్టినట్టు తెలిపారు.

‘ఆప్‌ పనైపోయిందని మా పార్టీ ఎమ్మెల్యేలకు బీజేపీ నాయకులు ఫోన్లు చేస్తున్నారు. ఎంపీ టికెట్‌ లేదా ప్రభుత్వంలో కీలకమైన పదవి ఇస్తామని నాకు ఆశచూపారు. అరుణాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లో మాదిరిగా ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తారని బీజేపీ నాయకులు నాతో చెప్పార’ని అల్కా లంబా తెలిపారు. బీజేపీ నాయకులు తనతో మాట్లాడిన వివరాలను ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియాకు తెలిపినట్టు చెప్పారు.

తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీకి బీజేపీ షాక్‌ ఇచ్చింది. ఎంసీడీ ఎన్నికల్లో కమలం వికసించింది. ఈవీఎంల మోసం వల్లే బీజేపీ గెలిచిందని ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement