ఆగదు నా పెళ్లి... | Birdegroom to go his marriage after accident | Sakshi
Sakshi News home page

ఆగదు నా పెళ్లి...

Apr 22 2015 11:51 AM | Updated on Mar 9 2019 4:28 PM

ఆగదు నా పెళ్లి... - Sakshi

ఆగదు నా పెళ్లి...

పెళ్లి బృందం ఆటోలో వెళుతోంది. బుధవారం ఉదయం 10.30 గంటలకు పెళ్లి.

ప్రథమ ఘట్టం...
పెళ్లి బృందం ఆటోలో వెళుతోంది. బుధవారం ఉదయం 10.30 గంటలకు పెళ్లి. ఆదిలాబాద్ జిల్లా కోటపల్లి మండలం సీతంపల్లిలో కల్యాణ వేడుక. పెళ్లి ముహూర్తానికి రెండు గంటల ముందు ఆ బృందానికి ప్రమాదం ఎదురైంది. సర్వాయిపేట వద్ద ఆటో బోల్తాపడింది. వరుడు. ఎస్.మల్లేశ్, మరో నలుగురికి గాయలు. స్థానికులు చెన్నూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ద్వితీయ ఘట్టం...
వైద్య సిబ్బంది ప్రాథమిక చికిత్స చేశారు. సాధారణంగా పెళ్లికి ముందు ఇలా ప్రమాదం జరిగితే ముందుకు వెళ్లేందుకు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. కానీ, ఇక్కడ మల్లేశ్ మాత్రం... ఏ ప్రమాదమూ తన పెళ్లిని ఆపలేదనే బలమైన సంకల్పంతో గాయాలకు కట్లు కట్టడం ఆలస్యం, బంధు వర్గంతో చెన్నూరు ప్రభుత్వ ఆస్పత్రి నుంచి మరో ఆటోలో సీతంపల్లికి బయల్దేరాడు. ముహూర్తం దాటిపోయినా... పెళ్లి మాత్రం ఈ రోజే జరగాలని ఎంతో ఆశతో ముందడుగు వేశాడు.
- కోటపల్లి (ఆదిలాబాద్)

ప్రమాదంలో గాయపడిన పెళ్లి బృందం...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement