దేశీయ అతిపెద్ద టెలికాం కంపెనీ భారతీ ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ వార్షిక వేతనం రూ.30 కోట్ల పైమేటేనట.
న్యూఢిల్లీ : దేశీయ అతిపెద్ద టెలికాం కంపెనీ భారతీ ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ వార్షిక వేతనం రూ.30 కోట్ల పైమేటేనట. ఐదేళ్ల కాలపరిమితి గల కంపెనీ చైర్మన్ పదవికి మరోమారు ఎంపికైన మిట్టల్.. స్థిరవేతనం కింద రూ.21 కోట్లు, ఫర్ఫార్మెన్స్ ఇన్సెసింటివ్స్ కింద రూ.9 కోట్లను వార్షికంగా ఈ ఏడాది అందుకోనున్నట్టు కంపెనీ పేర్కొంది. జీతం కాక పైవచ్చు వచ్చే ఆదాయాలను మినహాయించి ఆయన ఈ వేతనాన్ని అందుకోనున్నారు. జీతానికి పైన వచ్చు ఆదాయాలు కలుపుకుంటే ఆయన రూ.30 కోట్లకు పైననే ఆదాయాన్ని ఆర్జించనున్నట్టు తెలుస్తోంది. దీంతో అత్యధిక వార్షిక వేతన ప్యాకేజీని అందుకుంటున్న వారిలో ఒకరిగా సునీల్ మిట్టల్ నిలిచారు.
2016 ఆగస్టు 19న కంపెనీ నిర్వహించిన 21వ వార్షిక సర్వసభ్య సమావేశంలో సునీల్ మిట్టల్ వార్షిక వేతనం పెంచాలని నిర్ణయించినట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఆయన వార్షిక ప్యాకేజీ 27.8 కోట్లగా ఉండేది. సునీల్ మిట్టల్ వేతన పెంపుతో పాటు భారతీ ఎయిర్టెల్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో(ఇండియా, దక్షిణాసియా)గా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్న గోపాల్ విట్టల్ వేతనాన్ని కూడా సమీక్షించాలని బోర్డు నిర్ణయించింది. ఈ నిర్ణయంతో ఇకనుంచి గోపాల్ మిట్టల్ కూడా స్థిర వేతనం కింద వార్షికంగా రూ.7 కోట్లను అందుకోనున్నారు. సవరించిన గోపాల్ విట్టల్ వేతనం 2016 జూన్ 1 నుంచి 2018 జనవరి 31వరకు వర్తించనుంది.