మహిళా ఎమ్మెల్యేపై డీఎస్పీ అసభ్య వ్యాఖ్యలు | Assam DSP arrested for Facebook post about a BJP lady MLA | Sakshi
Sakshi News home page

మహిళా ఎమ్మెల్యేపై డీఎస్పీ అసభ్య వ్యాఖ్యలు

Apr 29 2017 3:45 PM | Updated on Mar 29 2019 5:33 PM

మహిళా ఎమ్మెల్యేపై డీఎస్పీ అసభ్య వ్యాఖ్యలు - Sakshi

మహిళా ఎమ్మెల్యేపై డీఎస్పీ అసభ్య వ్యాఖ్యలు

అసోంకు చెందిన బీజేపీ మహిళ ఎమ్మెల్యేపై ఆ రాష్ట్ర డీఎస్పీ ఒకరు ఫేస్‌బుక్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం దుమారం రేపుతోంది.

అసోంకు చెందిన బీజేపీ మహిళ ఎమ్మెల్యేపై ఆ రాష్ట్ర డీఎస్పీ ఒకరు ఫేస్‌బుక్‌లో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం దుమారం రేపుతోంది. వివాదాస్పద డీఎస్పీ అంజన్‌ బోరా ఇటీవల అధికార బీజేపీకి చెందిన ఓ మహిళ ఎమ్మెల్యేపై ఫేస్‌బుక్‌లో అసభ్య పోస్టు చేశారు. ఆయన పోస్టుపై దుమారం రేగుతున్న నేపథ్యంలో పోలీసుశాఖ ఆయనపై శాఖపరమైన చర్యలు ప్రారంభించింది. ఆయనపై డిపార్టమెంట్‌ పరిధిలో విచారణ ప్రారంభించడమే కాకుండా.. నేరపూరిత అభియోగాల కింద ఆయనను సీఐడీ శనివారం అరెస్టు చేసింది.

అసోంలో అధికార బీజేపీకి ఇద్దరు మహిళ ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో ఒక మహిళ ఎమ్మెల్యేను ఇంటిపేరుతో సంబోధిస్తూ ఆయన ఫేస్‌బుక్‌లో అభ్యంతరకరమైన పోస్టు పెట్టారు. ఈ పోస్టుపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతంలోనూ ఇలాగే మహిళా ప్రజాప్రతినిధులపై దుర్భాషలు ఆడిన అంజన్‌ బొరా సస్పెన్షన్‌కు గురయ్యారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement