యూఎస్ రాయబార కార్యాలయంపై కాల్పులు | Assailants fire shot at US Consulate in Istanbul | Sakshi
Sakshi News home page

యూఎస్ రాయబార కార్యాలయంపై కాల్పులు

Aug 10 2015 12:53 PM | Updated on Aug 24 2018 6:29 PM

యూఎస్ రాయబార కార్యాలయంపై కాల్పులు - Sakshi

యూఎస్ రాయబార కార్యాలయంపై కాల్పులు

టర్కీలో ఇస్తాంబుల్ నగరంలోని యూఎస్ రాయబారి కార్యాలయంపై సోమవారం తీవ్రవాదుల విచక్షణరహితంగా కాల్పులు జరిపారు.

అంకారా : టర్కీలో ఇస్తాంబుల్ నగరంలోని యూఎస్ రాయబారి కార్యాలయంపై సోమవారం తీవ్రవాదుల విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. దాంతో భద్రత సిబ్బంది వెంటనే అప్రమత్తమై... తీవ్రవాదులపై ఎదురు కాల్పులకు తెగబడింది. దాంతో తీవ్రవాదులు అక్కడి నుంచి పరారైయ్యారు. ఈ మేరకు స్థానిక మీడియా సోమవారం వెల్లడించింది. అయితే ఈ కాల్పుల్లో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని తెలిపింది.

కాగా స్థానిక మూడంతస్థుల పోలీస్ స్టేషన్ భవనంపై తీవ్రవాదులు గత రాత్రి బాంబులతో దాడి చేశారు. దాంతో భవనంలోని కొంత భాగం కుప్పకూలింది.  దీంతో 10 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఏడుగురు పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారని మీడియా పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement