మళ్లీ పెళ్లి చేసుకున్న పిచాయ్ మామ | Arya Samaj Wedding For Sundar Pichais Father-in-Law At 70 | Sakshi
Sakshi News home page

మళ్లీ పెళ్లి చేసుకున్న పిచాయ్ మామ

Sep 30 2015 12:44 PM | Updated on Sep 3 2017 10:15 AM

మళ్లీ పెళ్లి చేసుకున్న పిచాయ్ మామ

మళ్లీ పెళ్లి చేసుకున్న పిచాయ్ మామ

గూగుల్ ముఖ్య కార్యనిర్వహాణాధికారి సుందర్ పిచాయ్ మామయ్య ఓలారామ్ హర్యానీ (70) మళ్లీ పెళ్లి కొడుకు అయ్యారు.

జైపూర్ : గూగుల్ ముఖ్య కార్యనిర్వహాణాధికారి సుందర్ పిచాయ్ మామయ్య ఓలారామ్ హర్యానీ (70) మళ్లీ పెళ్లి కొడుకు అయ్యారు. రాజస్థాన్లోని ఆర్య సమాజ కార్యాలయంలో ఆ సంస్థ ఆచారాలకు అనుగుణంగా మంగళవారం మాధురి శర్మ (65)ను ఆయన వివాహం చేసుకున్నారు.

మాధురీ శర్మ రాజస్థాన్లోని కోట నివాసి. ఆమె భర్త మిలటరీలో పని చేసే వారు. ఆయన మరణించారు. ఓలారామ్ కోటలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉద్యోగిగా పని చేసి రిటైర్ అయ్యారు. అనంతరం ఆయన ముంబైలో నివసిస్తున్నారు. ఓలారామ్ మొదటి భార్య మరణించారు. ఓలారామ్కు ఇద్దరు పిల్లలు. ఓ కుమారుడు, ఓ కుమార్తె. ఓలారామ్ కుమార్తె అంజలిని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement