నటి అపర్ణాసేన్ను ప్రశ్నించిన ఈడీ | Aparna Sen appears for questioning in Saradha scam | Sakshi
Sakshi News home page

నటి అపర్ణాసేన్ను ప్రశ్నించిన ఈడీ

Aug 18 2014 8:42 PM | Updated on Sep 5 2018 1:38 PM

అపర్ణాసేన్ ఆమె భర్త కళ్యాణ్ రాయ్ - Sakshi

అపర్ణాసేన్ ఆమె భర్త కళ్యాణ్ రాయ్

దేశవ్యాప్తంగా సంచలనం సష్టించిన పది వేల కోట్ల శారదా చిట్‌ఫండ్ కుంభకోణం కేసులో బెంగాలీ నటి, దర్శకురాలు అపర్ణాసేన్ ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) అధికారులు సోమవారం ప్రశ్నించారు.

కోల్‌కతా: దేశవ్యాప్తంగా సంచలనం సష్టించిన పది వేల కోట్ల శారదా చిట్‌ఫండ్ కుంభకోణం కేసులో ప్రముఖ బెంగాలీ నటి, దర్శకురాలు అపర్ణాసేన్, పశ్చిమ బెంగాల్ టెక్స్టైల్ మంత్రి శ్యామపాద ముఖర్జీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) అధికారులు సోమవారం ప్రశ్నించారు. శారదా గ్రూపు ఆధ్వర్యంలో నడిచిన పత్రికకు అపర్ణాసేన్ ఎడిటర్‌గా వ్యవహరించిన నేపథ్యంలో ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. అపర్ణాసేన్ వెంట ఆమె భర్త కళ్యాణ్ రాయ్ కూడా ఉన్నారు.

తమ ప్రశ్నలన్నిటికీ అపర్ణాసేన్ సమాధానం ఇచ్చారని, కేసు విచారణలో అన్ని విధాలా సహకరిస్తానని చెప్పారని అధికారులు వెల్లడించారు. అలాగే 2009లో ఓ స్థిరాస్తి అమ్మకానికి సంబంధించి మంత్రి ముఖర్జీని ఈడీ అధికారులు ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement