తాప్సీని అంత కష్టమైన ప్రశ్నలెందుకడిగారు? | Amitabh Bachchan asks Taapsee Pannu tough questions | Sakshi
Sakshi News home page

తాప్సీని అంత కష్టమైన ప్రశ్నలెందుకడిగారు?

Aug 9 2016 4:43 PM | Updated on Aug 13 2018 3:04 PM

తాప్సీని అంత కష్టమైన ప్రశ్నలెందుకడిగారు? - Sakshi

తాప్సీని అంత కష్టమైన ప్రశ్నలెందుకడిగారు?

కోర్టు సీన్‌.. ఎదురుగా లాయర్‌ పాత్రలో బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌.. బోనులో నిందితురాలిగా తాప్సీ..

కోర్టు సీన్‌.. ఎదురుగా లాయర్‌ పాత్రలో బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌.. బోనులో నిందితురాలిగా తాప్సీ..

'మీరు వర్జినా కాదా?' అని లాయర్‌ ప్రశ్న.. బిత్తరపోయిన నిందితురాలిని చూస్తూ.. 'తలూపడం కాదు.. అవునా? కాదా? చెప్పండి' అని లాయర్‌ గద్దింపు. 'కాదు' అని తాప్సీ సమాధానం. ఇది అమితాబ్ బచ్చన్‌, తాప్సీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'పింక్‌' సినిమా ట్రైలర్‌ లోని ఓ సీన్‌. ఈ సినిమా ట్రైలర్‌ను మంగళవారం విడుదల చేశారు. ఇందులో లాయర్‌ దీపక్‌గా అమితాబ్‌ నటిస్తుండగా.. ఓ కేసులో నిందితురాలిగా తాప్సీ కనిపించనుంది. ఆమె చేసిన నేరం ఏమైంది తెలియనప్పటికీ.. హత్యకేసులో నిందితురాలిగా ఉన్నట్టు ట్రైలర్‌ను బట్టి అర్థం అవుతున్నది. క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌గా అనిరుద్ధ రాయ్‌ చౌదరి దర్శకత్వంలో రూపొందిన 'పింక్‌' సినిమా సెప్టెంబర్‌ 18న విడుదల కానుంది. షూజిత్‌ సర్కార్‌ నిర్మించిన ఈ సినిమా ఓ మహిళ న్యాయపోరాటం నేపథ్యంగా తెరకెక్కినట్టు కనిపిస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement